News August 2, 2024
IND vs SL: మూడు దశాబ్దాలుగా మనదే ఆధిపత్యం!

ఇవాళ్టి నుంచి భారత్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కాగా 27 ఏళ్లుగా వన్డేల్లో శ్రీలంకపై టీమ్ ఇండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోలేదు. లంక చివరిసారిగా 1997లో సచిన్ నాయకత్వంలోని భారత్‌పై సిరీస్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన 13 సిరీస్‌లలో టీమ్ ఇండియానే నెగ్గింది. మరి ఈ రికార్డును భారత్ కొనసాగిస్తుందో లేదా లంక బ్రేక్ చేస్తుందో చూడాలి.
Similar News
News October 17, 2025
స్వీట్ పొటాటో తింటున్నారా?

చిలగడదుంప (స్వీట్ పొటాటో) పోషకాల గని అని నిపుణులు చెబుతున్నారు. ‘ఒక మీడియం సైజు ఉడికించిన స్వీట్ పొటాటో మీ రోజువారీ విటమిన్ A అవసరాలను 100% పైగా అందిస్తుంది. ఇది కంటి చూపునకు, బలమైన రోగనిరోధక శక్తి & గుండె, మూత్రపిండాల వంటి కీలక అవయవాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులోని శక్తిమంతమైన బీటా-కెరోటిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి, శరీరంలో మంటను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది’ అని తెలిపారు.
News October 17, 2025
వంటింటి చిట్కాలు

* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి, ఫ్రిజ్‌లో పెడితే నల్లగా మారవు.
<<-se>>#VantintiChitkalu<<>>
News October 17, 2025
BCCI అపెక్స్ కౌన్సిల్లో చాముండేశ్వరనాథ్

భారత మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ చాముండేశ్వరనాథ్‌కు BCCI అత్యున్నత కమిటీలో చోటు దక్కింది. బోర్డు అపెక్స్ కౌన్సిల్లో ICA ప్రతినిధిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఆన్లైన్ ఓటింగ్‌లో వి.జడేజాపై ఆయన గెలుపొందారు. దీంతో అపెక్స్ కౌన్సిల్‌కు ఎంపికైన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు. రాజమండ్రికి చెందిన ఈయన ఆంధ్ర తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు. జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గానూ పనిచేశారు.