News June 12, 2024
IND vs USA: శివమ్ దూబేపై వేటు?

టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ USAతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఓ మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తున్న ఆల్రౌండర్ శివమ్ దూబేను జట్టు నుంచి తప్పించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో వికెట్ కీపర్ సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు టాక్. కాగా T20 WCకు ఎంపికైనప్పటి నుంచి దూబే ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు.
Similar News
News September 15, 2025
వ్యాయామం, రన్నింగ్.. మితంగా చేస్తేనే మేలు!

రోజూ వ్యాయామం చేయడం మంచిదే. కానీ అతిగా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వారానికి 30-50kms రన్నింగ్ చేయొచ్చు. అలాగే రోజుకు 7000-10,000 అడుగుల నడక ఉత్తమం. ఎక్కువ దూరం పరిగెత్తడం వల్ల గుండె, కీళ్ల సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ సరిపోతుంది. మితమైన వ్యాయామం, సరైన విశ్రాంతి ముఖ్యం’ అని సూచిస్తున్నారు. SHARE IT
News September 15, 2025
రేపు రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

TG: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. మంగళవారం రాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రికి లేఖలు ఇచ్చింది.
News September 15, 2025
సిరాజ్కు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఆగస్టు) అవార్డు దక్కింది. ఇటీవల ఇంగ్లండ్తో చివరి టెస్టులో సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశారు. 9 వికెట్లు తీసి సిరీస్ 2-2తో సమం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సిరీస్లో ప్రతి మ్యాచ్ ఆడిన సిరాజ్.. మొత్తం 23 వికెట్లు పడగొట్టారు.