News October 5, 2025

IND వార్నింగ్.. పాక్ రిప్లై ఇదే!

image

ప్రపంచ పటం నుంచి లేపేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ ఆర్మీ స్పందించింది. ‘భారత నేతలు, ఆర్మీ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పాక్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేమూ గట్టిగా స్పందిస్తాం. భారత్‌లోని ప్రతి మూలకు మా దళాలు వెళ్లగలవు. ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధం జరిగితే అది వినాశనానికి దారితీయొచ్చు. ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టడం అనేది పరస్పరం ఉంటుంది’ అని హెచ్చరించింది.

Similar News

News October 5, 2025

ఈ నెల 9న OTTలోకి ‘వార్-2’!

image

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ టు డిజిటల్ విండో ప్రకారం బాలీవుడ్ సినిమాలు 8 వారాల్లో, టాలీవుడ్ మూవీలు 4 వారాల్లో OTTలో రిలీజ్ అవుతున్నాయి.

News October 5, 2025

610 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే ఆఖరు తేదీ

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 610 ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ(OCT 7). బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీర్) ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రాతపరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష బెంగళూరులో అక్టోబర్ 25, 26తేదీల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.177. వెబ్‌సైట్: https://bel-india.in/

News October 5, 2025

గేదెను కొంటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి

image

గేదెను కొనుగోలు చేసేటప్పుడు అది ఎప్పుడు ఈనింది, ఎన్నవ ఈతలో ఉంది, ఈనిన తర్వాత ఎన్ని నెలలు పాడిలో ఉంది, కట్టినట్లయితే ఎన్ని నెలలు గర్భంలో ఉంది, వట్టి పోయి ఎంతకాలమైంది, ఈనడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అనే విషయాలను తప్పకుండా యజమానిని అడిగి తెలుసుకోవాలి. సంతలో పశువులను కొనుగోలు చేయాలనుకుంటే వాటికి రంగులు వేశారా? కొమ్ములు చెక్కారా? వంటివి గమనించి కొనాలి. పొదుగు జబ్బు వచ్చిన గేదెలు కొనకూడదు.