News July 10, 2024
గంభీర్ ఆధ్వర్యంలో IND ODI WC సాధిస్తుంది: భరద్వాజ్

గతంలో ఫామ్ కోల్పోయిన రోహిత్ శర్మపై గౌతమ్ గంభీర్ విశ్వాసం ఉంచారని ఆయన చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ అన్నారు. ఆ తర్వాత రోహిత్ గొప్ప క్రికెటర్ అయ్యారని గుర్తు చేసుకున్నారు. ‘గౌతీ భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికవడం గర్వంగా ఉంది. ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసే సామర్థ్యం ఆయనకు ఉంది. క్రికెట్లో దేశ ప్రతిష్ఠను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారు. గంభీర్ ఆధ్వర్యంలో భారత్ ODI WC సాధిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న MovieRulz

పైరసీ మాఫియా టాలీవుడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. iBOMMA, Bappam TV లాంటి సైట్లు బ్లాక్ చేసినా, MovieRulz మాత్రం తన దారులు మార్చుకుంటూ కొనసాగుతోంది. శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్జ్‌లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్లను అప్లోడ్ చేశారు. ఇప్పటికే iBOMMA రవిపై పోలీసులు విచారణను వేగవంతం చేసినప్పటికీ MovieRulz మాత్రం సవాల్ విసురుతోంది.
News November 23, 2025
నాగచైతన్య కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశారు. ‘వృషకర్మ’ టైటిల్‌తో నాగచైతన్య యాంగ్రీ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను Xలో పోస్ట్ చేశారు. చైతూకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ సాలిడ్‌గా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటిస్తున్నారు.
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


