News July 13, 2024

అమర జవాన్ భార్యపై అసభ్యకర కామెంట్.. నెటిజన్‌పై కేసు

image

అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతిపై అసభ్యకర <<13592580>>కామెంట్<<>> చేసిన నెటిజన్‌పై కేసు నమోదైంది. అన్షుమాన్‌ సేవలకుగానూ ఇటీవల ఆయన భార్య స్మృతికి కేంద్రం ‘కీర్తిచక్ర’ అవార్డు ప్రదానం చేసింది. ఆ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురైన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఓ నెటిజన్ ఆమెపై అసభ్యకర కామెంట్ చేశాడు. దీన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News November 10, 2025

CNG కాదు.. ఆత్మాహుతి దాడేనా?

image

<<18252445>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనకు CNG కారణమని తొలుత భావించారు. కానీ CNG పేలితే ఇంత భారీ తీవ్రత ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఉగ్రవాద దాడి లేదా ఆత్మాహుతి దాడి అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ఈ పేలుడుకు బాధ్యత తీసుకుంటూ ఏ ప్రకటన చేయలేదు.

News November 10, 2025

మార్కెట్‌కు సెలవు: పెను ప్రమాదమే తప్పింది!

image

ఢిల్లీలో జరిగిన భారీ పేలుడులో పెను ప్రమాదమే తప్పింది. బ్లాస్ట్ జరిగిన ఎర్రకోట మెట్రో సమీపంలోని చాందినీ చౌక్‌లో ఓల్డ్ లజపత్ రాయ్ మార్కెట్ ఉంటుంది. సహజంగా ఆ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది. అయితే సోమవారం దానికి సెలవు కావడంతో ఆ ప్రాంతంలో జన సాంద్రత కాస్త తక్కువగా ఉంది. లేదంటే మృతుల సంఖ్య భారీగా నమోదయ్యేది. మార్కెట్‌ను రేపు కూడా మూసేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ భార్గవ్ ప్రకటించారు.

News November 10, 2025

ఇన్‌స్టంట్ లోన్లవైపే ఎక్కువ మంది మొగ్గు

image

వడ్డీ ఎంతైనా ఫర్వాలేదు… పెద్దగా హామీ పత్రాల పనిలేకుండా ఇచ్చే ఇన్‌స్టంట్ లోన్లవైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. దీపావళి సీజన్లో ‘పైసాబజార్’ చేపట్టిన సర్వేలో 42% మంది ఈ లోన్లపై ఆసక్తిచూపారు. 25% మంది వడ్డీపై ఆలోచించారు. 80% డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి లోన్లకు ప్రాధాన్యమిచ్చారు. కొత్తగా 41% పర్సనల్ LOANS తీసుకున్నారు. కాగా అనవసర లోన్లు సరికాదని, వాటి వడ్డీలతో కష్టాలే అని EXPERTS సూచిస్తున్నారు.