News August 13, 2024

స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలు.. తేడా ఇదే!

image

స్వాతంత్య్ర‌ దినోత్సవం నాడు జెండాను స్తంభానికి దిగువ భాగంలో కట్టి పైకి లాగి ఎగుర‌వేస్తారు. గ‌ణ‌తంత్ర దినోత్సవం నాడు స్తంభం పైభాగంలో జెండాను చుట్టి అమర్చి కిందికి ఆవిష్కరిస్తారు. జెండాను పైకి లాగి ఎగురవేస్తే ఒక దేశం ఆవిర్భావానికి చిహ్నంగా ప‌రిగ‌ణిస్తారు. అదే పైనుంచి కిందికి ఆవిష్క‌రిస్తే గ‌ణ‌తంత్ర రాజ్యంగా ఆవిర్భ‌వించ‌డాన్ని, రాజ్యాంగం పట్ల నిబద్ధత పునరుద్ధరణకు ప్రతీకాత్మక సూచనగా భావిస్తారు.

Similar News

News November 17, 2025

2026 JANలో HYD-విజయవాడ NH విస్తరణ

image

TG: HYD-విజయవాడ NH65 విస్తరణ పనులు 2026 JANలో ప్రారంభం కానున్నాయి. 6 లేన్లుగా దీని విస్తరణకు DPR ఖరారైంది. పనులకు టెండర్లనూ పిలిచారు. ఈ నెలాఖరున ఇవి ఫైనల్ అవుతాయి. దాదాపు ₹10,000 CRతో 231 KMమేర విస్తరణ చేస్తారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. ROBలు, అండర్‌పాస్‌లు కూడా హైవే విస్తరణ పనులలో భాగంగా ఉంటాయి. హైవే విస్తరణలో 33 ప్రధాన జంక్షన్లు, 105 చిన్న జంక్షన్లను అభివృద్ధి చేస్తారని అధికారులు తెలిపారు.

News November 17, 2025

OFFICIAL: ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000

image

AP: ఈ నెల 19న పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్‌నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు.

News November 17, 2025

21న ఓటీటీలోకి ‘బైసన్’

image

* చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు.
* హాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించిన F1 మూవీ DEC 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బ్రాడ్ పిట్ లీడ్ రోల్ పోషించారు.