News July 25, 2024
ఆ స్థిరాస్తులకు ఇండెక్సేషన్ బెనిఫిట్ వర్తిస్తుంది: రెవెన్యూ కార్యదర్శి

ఇండెక్సేషన్ బెనిఫిట్ తొలగింపుతో స్థిరాస్తి అమ్మకాలకు నష్టమేమి లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. ‘స్థిరాస్తి అమ్మకాలపై LTCG ట్యాక్స్‌ను 20% నుంచి 12.5%కు తగ్గించాం. విక్రేతలకు రోలోవర్ బెనిఫిట్ ఉంటుంది. అమ్మకంతో వచ్చిన నగదును మరో ప్రాపర్టీ కొనుగోలుకు వెచ్చిస్తే ₹కోటి వరకు ఎలాంటి LTCG ట్యాక్స్ ఉండదు. 2001కు ముందు కొన్న స్థిరాస్తులకు ఇండెక్సేషన్ బెనిఫిట్ కొనసాగుతుంది’ అని తెలిపారు.
Similar News
News December 22, 2025
ఒక్క క్లిక్‌తో భూముల సమాచారం: మంత్రి

TG: భూ పరిపాలన వ్యవస్థకు సంబంధించి జనవరిలో ఆధునీకరించిన డిజిటల్ వ్యవస్థను తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ‘రెవెన్యూ, స్టాంప్స్&రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే ప్లాట్‌ఫామ్ కిందకి తీసుకొచ్చి “భూభారతి”తో లింక్ చేస్తాం. ఆధార్‌తో లింకైన ఫోన్ నంబర్‌తో లాగిన్ అవగానే ఒక్క క్లిక్‌తో భూముల సమాచారం వస్తుంది. సర్వే నంబర్లకు మ్యాప్‌ను రూపొందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News December 22, 2025
బిగ్‌బాస్ విన్నర్ కంటే ఇతడికే ఎక్కువ రెమ్యునరేషన్!

నిన్నటితో ముగిసిన బిగ్‌బాస్-9లో కళ్యాణ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అతడు రూ.35లక్షలు గెలుచుకున్నారు. అయితే 4వ స్థానంలో ఎలిమినేట్ అయిన ఇమ్మాన్యుయేల్.. కళ్యాణ్ కంటే ఎక్కువ మనీ అందుకున్నట్లు తెలుస్తోంది. 15వారాలకు గానూ వారానికి రూ.2.50 లక్షల చొప్పున అతడు మొత్తం రూ.35-40లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న వారిలో ముందువరుసలో ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.
News December 22, 2025
టిప్పే రూ.68,600 ఇచ్చేశాడు!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ, అభిరుచి ఉంటుంది. కొందరిలో అది కాస్త ఎక్కువ ఉంటుంది. బెంగళూరులో ఓ వ్యక్తి డెలివరీ బాయ్స్‌కు ఏడాదిలో ₹68,600, చెన్నై యూజర్ ₹59,505 టిప్స్ ఇచ్చినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వెల్లడించింది. ‘ముంబైకర్ ఏడాదిలో రెడ్ బుల్ షుగర్ ఫ్రీ కోసం ₹16.3L, నోయిడా వ్యక్తి బ్లూటూత్ స్పీకర్లు, SSDల కోసం ₹2.69L వెచ్చించారు. ఓ హైదరాబాదీ 3 ఐఫోన్స్ కోసం ₹4.3L ఖర్చు చేశారు’ అని తెలిపింది.


