News November 7, 2024
INDIA A: మళ్లీ అదే కథ

ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రస్తుతం భారత్ 64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ డకౌటయ్యారు. సీనియర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురేల్ (24*), నితీశ్ రెడ్డి (0*) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మైకేల్ నెసెర్ 4 వికెట్లతో చెలరేగారు.
Similar News
News January 13, 2026
పప్పు గింజల పంటల్లో చిత్త పురుగులు.. నివారణ

మినుము, పెసర, అలసంద, కంది లాంటి పప్పు గింజల పైర్లు లేత దశలో(2-4 ఆకులు) ఉన్నప్పుడు చిత్త/పెంకు పురుగులు ఆశిస్తాయి. ఆకుల అడుగు భాగాల్లో చేరి రంధ్రాలు చేసి తినేస్తాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 5గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి.
News January 13, 2026
కుక్కలపై ప్రేముంటే ఇళ్లకు తీసుకెళ్లండి: సుప్రీంకోర్టు

వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిలో ఎవరైనా గాయపడినా లేదా మరణించినా స్థానిక అధికారులు, కుక్కలకు ఆహారం పెట్టే వారే (Feeders) బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. వాటిపై ప్రేమ ఉన్నవారు ఇళ్లకు తీసుకెళ్లాలని, ప్రజలను భయపెట్టేలా రోడ్లపై వదలొద్దని జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం పేర్కొంది. బాధితులకు భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది.
News January 13, 2026
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పండగ వేళ నాన్‌వెజ్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఏపీలోని విజయవాడ సహా ప్రధాన నగరాల్లో కేజీ చికెన్ రేట్ రూ.350 పలుకుతోంది. పట్టణాలు, గ్రామాల్లో అయితే దీనికి అదనంగా రూ.20 కలిపి రూ.370కి విక్రయిస్తున్నారు. అటు తెలంగాణలోని హైదరాబాద్‌లో కేజీ కోడి మాంసం రూ.300-320 పలుకుతోంది. మిగతా ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మరి మీ ఏరియాలో కేజీ చికెన్ ధర ఎంత?


