News October 21, 2025

ఇండియా-A జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా పంత్

image

INDలో SA-Aతో ఈనెల 30 నుంచి స్టార్ట్ కానున్న 4 రోజుల మ్యాచ్‌‌లకు BCCI జట్టును ప్రకటించింది. పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
ఫస్ట్ మ్యాచ్ టీమ్: పంత్(C), మాత్రే, జగదీశన్, సుదర్శన్(VC), పడిక్కల్, పాటిదార్, హర్ష్, తనుష్, మానవ్, కాంబోజ్, యశ్, బదోనీ, జైన్
2nd మ్యాచ్: పంత్(C), రాహుల్, జురెల్, సుదర్శన్, పడిక్కల్, గైక్వాడ్, హర్ష్, తనుష్, మానవ్, ఖలీల్, బ్రార్, ఈశ్వరన్, ప్రసిద్ధ్, సిరాజ్, ఆకాశ్

Similar News

News October 21, 2025

Asia Cup: నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్!

image

ACC చీఫ్ నఖ్వీ విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి BCCI సిద్ధమైంది. Asia Cup ట్రోఫీని భారత్‌కు అప్పగించాలంటూ మెయిల్ పంపింది. ఇవ్వకపోతే ICCకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. నఖ్వీ నుంచి స్పందన రాకపోతే విషయాన్ని ఐసీసీ ఎదుటే తేల్చుకుంటామని బీసీసీఐ సెక్రటరీ సైకియా అన్నారు. నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ తీసుకోవడానికి భారత క్రికెటర్లు నిరాకరించడంతో ఆయన ట్రోఫీని వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

News October 21, 2025

స్పామ్ మెసేజ్‌ల నియంత్రణకు వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

image

స్పామ్ మెసేజ్‌ల నియంత్రణకు WhatsApp ఓ ఫీచర్‌ను తీసుకొస్తోంది. యూజర్లు లేదా బిజినెస్ అకౌంట్స్ నుంచి అన్‌నోన్ నంబర్లకు పంపే బ్రాడ్‌కాస్ట్ మెసేజ్‌లకు లిమిట్ విధించనుంది. కొత్త నంబర్లకు మెసేజ్‌లు పంపినప్పుడు వారి నుంచి రిప్లైలు రాకపోతే ఆ మెసేజ్‌లన్నీ లిమిట్ లిస్టులో యాడ్ అవుతాయి. ఒక్కో మంత్‌లో నిర్దేశించిన లిమిట్‌కి చేరగానే మళ్లీ మెసేజ్‌లు పంపేందుకు వీలుండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది.

News October 21, 2025

నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – వాటిని గుర్తించే విధానం

image

భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లు.. విత్తన కుళ్లు, మొలక మాడు, నారు కుళ్లు, వేరు కుళ్లు, మొదలు కుళ్లు, కాండం కుళ్లు, తల కుళ్లు. పంటలో ఈ తెగుళ్లను ముందే గుర్తించేందుకు పొలంలో వేర్వేరు ప్రదేశాల్లో మొక్కలను ఎన్నుకొని, పీకి మెల్లగా మట్టిని తొలగించి శుభ్రం చేయాలి. అప్పుడు వేరు, భూమిలో ఉండే కాండం భాగాల్లో ఏదైనా రంగు మార్పు కనిపిస్తుందేమో చూడాలి. ఏదైనా మార్పు కనిపిస్తే అది వ్యాధి తొలి లక్షణంగా గుర్తించాలి.