News September 22, 2024

దులీప్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఇండియా-ఏ జట్టు

image

దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా-ఏ జట్టు సొంతం చేసుకుంది. ఇండియా-బీపై IND-A 132 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టేబుల్‌లో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని అందుకుంది. రుతురాజ్ సారథ్యంలోని ఇండియా-సీ జట్టు 9 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది.

Similar News

News March 25, 2026

షేన్ వార్న్ దూరదృష్టి.. RR డీల్‌తో పిల్లలకు భారీ ఆస్తి!

image

RR మాజీ కెప్టెన్, దివంగత షేన్ వార్న్ ముందుచూపు ఎలాంటిదో ఇప్పుడు రుజువైంది. IPL ప్రారంభంలో 4 సీజన్లకు కలిపి కేవలం ₹9.35 కోట్ల శాలరీ మాత్రమే తీసుకున్న ఆయన రిటైర్మెంట్ డీల్‌లో ఆడిన ప్రతి సీజన్‌లో 0.75% వాటా కావాలని కండిషన్ పెట్టారు. అలా 4 ఏళ్లలో 3% వాటా దక్కించుకున్నారు. తాజాగా RR ₹15,301 కోట్లకు అమ్ముడవడంతో ఆ 3% విలువ ఏకంగా ₹460 కోట్లకు చేరింది. ఇప్పుడు వార్న్ పిల్లలు కోటీశ్వరులయ్యారు.

News March 25, 2026

ఆముదం సాగుకు అనువైన సూటి రకాలు

image

☛ హరిత: పంట కాలం 130-150 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్లు. ఎండు తెగులు, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ☛ జ్వాల: పంట కాలం 90-180 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్లు. ఎండు తెగులు, బూజు తెగులును తట్టుకుంటుంది.
☛ DDS-107: పంట కాలం 100-150 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5 క్వింటాళ్లు. ఎండు తెగులును తట్టుకుంటుంది.
☛ ప్రగతి: పంట కాలం 120-140 రోజులు. దిగుబడి ఎకరాకు 6- 7 క్వింటాళ్లు.

News March 25, 2026

నేడు గుంటూరుకు సీఎం రేవంత్ రెడ్డి

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు గుంటూరుకు వెళ్లనున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూతురు వివాహానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. వేడుక అనంతరం రేవంత్ హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.