News June 25, 2024

సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

image

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.

Similar News

News October 22, 2025

ట్రాన్స్‌కో, జెన్‌కోలో మరో 6 నెలల పాటు సమ్మెలపై నిషేధం

image

AP: రాష్ట్ర పవర్ కార్పొరేషన్లలో మరో 6 నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్రాన్స్‌కో పరిధిలోని మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో, జెన్‌కోలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. నవంబర్ 10 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వివరించింది. కాగా ఇంతకు ముందు మే 10 నుంచి నవంబర్ 9 వరకు వర్తించేలా సమ్మె నిషేధ జీవో ఇచ్చింది. తాజాగా గడువు పొడిగించింది.

News October 22, 2025

రానున్న 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో పయనించి వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. అటు భారీ వర్షసూచన నేపథ్యంలో రేపు కూడా నెల్లూరు జిల్లాలోని స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.

News October 22, 2025

ఆసియా కప్‌ను నేనే ఇస్తా: మోహ్సిన్ నఖ్వీ

image

ఆసియా కప్‌ను భారత్‌కు తానే అప్పగిస్తానని ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ట్రోఫీని భారత్‌కు అప్పగించాలని నఖ్వీకి BCCI లేఖ రాసింది. ‘ఒక వేడుక ఏర్పాటు చేస్తాం. BCCI ఆఫీస్ హోల్డర్, విన్నింగ్ టీమ్‌లో అందుబాటులో ఉన్న ఏ ప్లేయర్‌తోనైనా వచ్చి ట్రోఫీ కలెక్ట్ చేసుకోండి’ అని నఖ్వీ చెప్పినట్లు GEO న్యూస్ పేర్కొంది. ఈ విషయాన్ని ICC వద్దే తేల్చుకోవాలని BCCI ఫిక్సైనట్లు తెలుస్తోంది.