News November 2, 2024

భారత్ ఆలౌట్.. 28 పరుగుల ఆధిక్యం

image

NZతో జరుగుతోన్న చివరి టెస్టులో భారత్ స్వల్ప ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్సులో కివీస్ 235 రన్స్ చేయగా టీమ్ ఇండియా 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేనకు 28 పరుగుల ఆధిక్యం లభించింది. గిల్ 90, పంత్ 60 రన్స్ చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 38 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో సత్తా చాటారు.

Similar News

News November 2, 2024

ఈనెల 5న రాష్ట్రానికి రాహుల్ గాంధీ: టీపీసీసీ చీఫ్

image

TG: దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నది తమ పార్టీ నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈనెల 5న బోయినపల్లిలో కులగణనపై సలహాలు, సూచనల కోసం నిర్వహించే కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని పేర్కొన్నారు. కులగణన ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారని చెప్పారు.

News November 2, 2024

ధోనీ రికార్డును పంత్ అధిగమిస్తాడా?

image

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అర్ధ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో భారతీయ వికెట్ కీపర్‌లలో అత్యధిక సార్లు 50+ స్కోర్‌ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచారు. మహేంద్ర సింగ్ ధోనీ 39 సార్లు 50+ రన్స్ బాది ప్రథమ స్థానంలో ఉండగా పంత్ 19 అర్ధ సెంచరీలు చేశారు. మూడు, నాలుగు స్థానాల్లో ఫారుఖ్ ఇంజినీర్ (18), సయ్యద్ కిర్మాణి (14) ఉన్నారు.

News November 2, 2024

అమితాబ్ రికార్డును బ్రేక్ చేయగలరా?

image

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ‘షోలే’ సినిమా 1975లో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా నెలకొల్పిన రికార్డును ఇప్పటి వరకు ఏ చిత్రం బ్రేక్ చేయలేకపోయింది. ఈ సినిమా ఏకంగా 25 కోట్ల టికెట్లను విక్రయించినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇది భారతీయ సినీ చరిత్రలో అత్యధికం. రాజమౌళి ‘బాహుబలి-2’ మూవీ టికెట్లు 10కోట్ల కంటే ఎక్కువే విక్రయించారు. ఇప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయా?