News September 20, 2024
భారత్ 376 పరుగులకు ఆలౌట్

చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆలౌట్ అయ్యింది. అశ్విన్(113), జడేజా(86), జైస్వాల్(56) రాణించడంతో భారత్ 376 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మూద్ 5, టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశారు.
Similar News
News January 7, 2026
HYD: 1000 డాలర్ల కోసం నిఖిత హత్య?

అమెరికాలో HYD యువతి నిఖిత హత్యకు డబ్బుల విషయమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. US పోలీసుల దర్యాప్తు ప్రకారం.. అర్జున్ శర్మకు నిఖిత 4500 డాలర్లు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. అందులో 3500 డాలర్లు ఇవ్వగా మిగతా డబ్బులు ఇవ్వాలని నిఖిత అడిగింది. ఈ క్రమంలో గొడవ పెద్దదై అర్జున్ నిఖితను హత్య చేసినట్లు భావిస్తున్నారు. మృతురాలి తండ్రి కూడా <<18770024>>డబ్బుల విషయమే<<>> హత్యకు కారణం అయ్యిందని మీడియా ద్వారానే తెలిసిందన్నారు.
News January 7, 2026
మన దగ్గరా అవకాడోను సాగు చేయొచ్చు

‘అవకాడో’ .. బ్రెజిల్, సెంట్రల్ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పండు ఇప్పుడు మనదేశంలోనూ పండుతోంది. ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతాలు వీటి సాగుకు అనుకూలమంటున్నారు శాస్త్రవేత్తలు. ఉద్యాన పంటల్లో భాగంగా అవకాడోను సాగుచేసి లాభాలు పొందవచ్చని సూచిస్తున్నారు. విత్తనం నుంచి పెరిగిన అవకాడో చెట్ల పండ్లను ఉత్పత్తి చేయడానికి 4-6 ఏళ్లు పడుతుంది, అయితే అంటుకట్టిన మొక్కలు 1-2 ఏళ్లలో ఫలాలను ఉత్పత్తి చేస్తాయి.
News January 7, 2026
మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్.. ఏది బెటర్?

ఈ ప్రశ్న తరచూ వినిపిస్తుంటుంది. నిజానికి రెండూ బెటరే. ఫిక్స్డ్ డిపాజిట్స్(FD)తో ఓ గ్యారంటీ, కంఫర్ట్ ఉంటుంది. నిర్ణీత వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయంలో డబ్బు అందుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్(MF)ను పెద్ద కంపెనీల్లో పెట్టుబడిగా పెడతారు. దీంతో దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుతాయి. FD స్క్రూడ్రైవర్ లాంటిదైతే, MF పవర్ డ్రిల్ లాంటిదని నిపుణులు చెబుతారు. రిటర్న్స్, ట్యాక్స్ వంటి విషయాల్లో MF బెటర్ ఆప్షన్.


