News November 28, 2024
ఫలితాలపై ఇండియా కూటమి హ్యాపీ: డీకే శివకుమార్
ఝార్ఖండ్ ఫలితాలపై ఇండియా కూటమి హ్యాపీగా ఉందని కర్ణాటక DCM డీకే శివకుమార్ అన్నారు. మహారాష్ట్ర ఓటమిపై అంతర్మథనం అవసరమన్నారు. మిగతా వాళ్లలా EVMలపై ఆయన నిందలేయకపోవడం గమనార్హం. ‘హేమంత్ సోరెన్ నాయకత్వంలో మా కూటమి గెలవడం హ్యాపీ. ఆయన మెరుగైన పాలన అందించారు. కష్టపడి ప్రజల్లో విశ్వాసం పొందారు. ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారు. మహారాష్ట్ర ప్రజల తీర్పును మేం గౌరవించి ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాల’ని అన్నారు.
Similar News
News November 28, 2024
రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో ‘క్రిప్టో క్రిస్టియన్ల’పై చర్చ!
ఇతర మతాల్లో చేరి రిజర్వేషన్ల కోసం హిందువులమని చెప్పుకోవడాన్ని <<14722317>>సుప్రీంకోర్టు<<>> తీవ్రంగా తప్పుబట్టడంతో దేశవ్యాప్తంగా క్రిప్టో క్రిస్టియన్లపై చర్చ జరుగుతోంది. క్రిప్టోకు సీక్రెటని అర్థం. వీరు క్రైస్తవాన్ని స్వీకరించి ఆ విశ్వాసాలనే పాటిస్తారు. ప్రభుత్వ పత్రాల్లో మాత్రం అలా మార్చుకోరు. రిజర్వేషన్లు, కోటా కోల్పోతామేమోనన్న భయంతో హిందువులుగా పేర్కొంటారు. రిజర్వేషన్లు హిందూ కులాలకు ఉండటమే ఇందుకు కారణం.
News November 28, 2024
సోదరుడి పెద్దకర్మకు హాజరైన సీఎం
AP: సీఎం చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడి పెద్దకర్మకు హాజరయ్యారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ కర్మకాండ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
News November 28, 2024
నాన్నా.. నువ్వు గ్రేట్: శిండే కొడుకు ఎమోషనల్ ట్వీట్
వ్యక్తిగత లక్ష్యాలను పక్కనపెట్టి, పొత్తుధర్మం పాటించడంలో తన తండ్రి ఆదర్శంగా నిలిచారని ఏక్నాథ్ శిండే కొడుకు, MP శ్రీకాంత్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం కోసం రేయింబవళ్లు శ్రమించారని పేర్కొన్నారు. ‘శివసేన అధినేతైన నా తండ్రిని చూసి గర్విస్తున్నాను. మోదీ, అమిత్షాపై ఆయన విశ్వాసం ఉంచారు. కూటనీతికి ఆదర్శంగా నిలిచారు. కామన్ మ్యాన్గా ప్రజల కోసం CM నివాసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచారు’ అని అన్నారు.