News September 24, 2024
భారత్, చైనా ఫైట్లో సాండ్విచ్ అవ్వలేం: దిసనాయకే

జియో పొలిటికల్ రైవల్రీకి శ్రీలంకను దూరంగా ఉంచుతానని ప్రెసిడెంట్ దిసనాయకే అన్నారు. పొరుగు దేశాలతో సంబంధాల్లో సమతూకం పాటిస్తానని చెప్పారు. ‘ఆ ఫైట్కు మేం దూరంగా ఉంటాం. అలాగే ఏదో ఒక పక్షం వైపు ఉండం. ప్రత్యేకించి భారత్, చైనా మధ్య సాండ్విచ్ అవ్వలేం. ఆ 2 మాకు మిత్రదేశాలే. అవి మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాం. EU, మిడిల్ఈస్ట్, ఆఫ్రికాతో సంబంధాలు కొనసాగిస్తాం’ అని తన ఫారిన్ పాలసీ గురించి వివరించారు.
Similar News
News October 27, 2025
AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్

* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15km వేగంతో కదులుతున్న తుఫాను
* రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
* 44 మున్సిపాలిటీలు, 233 మండలాల్లోని 1,419 గ్రామాలపై ప్రభావం
* 2,194 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
* కమ్యూనికేషన్ కోసం జిల్లాలకు 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు పంపిణీ
* వీఎంసీ కంట్రోల్ రూమ్: 0866-2424172, 0866-2422515, 0866-2427485 ఏర్పాటు
News October 27, 2025
అయ్యప్ప దీక్షలో ఉంటూ లంచం

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ ఆఫీసులో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు. 2 ఎకరాల 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.40వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.20వేలలో రూ.5వేలు తగ్గించి మిగతా రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. అతడు అయ్యప్ప దీక్షలో ఉండి లంచం తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
News October 27, 2025
WWC: ప్రతీకా స్థానంలో షెఫాలీ వర్మ!

మహిళా వన్డే వరల్డ్కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో గాయపడిన భారత ఓపెనర్ ప్రతీకా రావల్ స్థానంలో షెఫాలీవర్మ జట్టులోకి రానున్నారు. ఆస్ట్రేలియాతో ఈ నెల 30న జరిగే సెమీఫైనల్లో ఆమె జట్టులో చేరుతారని ESPN పేర్కొంది. కాగా గాయం కారణంగా ప్రతీకా టోర్నీలో మిగతా మ్యాచులకు దూరమయ్యారని వెల్లడించింది. దూకుడుగా ఆడే ప్లేయర్గా పేరున్న షెఫాలీ రాకతో జట్టుకు బలం చేకూరనుంది. ఈ మార్పుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


