News November 19, 2024
డ్రాగా ముగిసిన ఇండియా, మలేషియా మ్యాచ్
HYDలోని గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా, మలేషియా మధ్య జరిగిన ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. టైమ్ ముగిసే సరికి ఇరు జట్లు 1-1 గోల్స్తో సమంగా నిలిచాయి. భారత ఫుట్బాల్ జట్టుకు ఈ ఏడాది ఇదే లాస్ట్ మ్యాచ్ కాగా, ఈ ఏడాదిలో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. మనోలో మార్క్వెజ్ (స్పెయిన్) హెడ్ కోచ్గా నియామకం అయినప్పటి నుంచి 4 మ్యాచులు జరగగా, ఒక్క దాంట్లోనూ IND గెలవకపోవడం గమనార్హం.
Similar News
News November 19, 2024
BGTలో అత్యధిక వికెట్లు, రన్స్ తీసింది వీరే
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నాథన్ లియోన్ (116) కొనసాగుతున్నారు. అతని తర్వాతి స్థానాల్లో అశ్విన్ (114), కుంబ్లే (111), హర్భజన్(95), రవీంద్ర జడేజా (85), జహీర్ ఖాన్ (61) ఉన్నారు. అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (3262) పేరిట ఉంది. అతని తర్వాతి స్థానాల్లో పాంటింగ్ (2555), లక్ష్మణ్ (2434), ద్రవిడ్ (2143), క్లార్క్ (2049), పుజారా (2033) ఉన్నారు.
News November 19, 2024
ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి?: వైసీపీ
AP: రాష్ట్రంలో ఆడబిడ్డలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని YCP విమర్శించింది. బాపట్లలో మతిస్థిమితం లేని 11 ఏళ్ల బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారని, నిందితుడిని పోలీసులకు అప్పగించారని ట్వీట్ చేసింది. ‘మీ చేతగానితనంతో ఇంకెంత మంది ఆడబిడ్డలు ఇలాంటి కామాంధులకి బలవ్వాలి?’ అని CM CBN, Dy.CM పవన్, హోంమంత్రి అనితను ప్రశ్నించింది.
News November 19, 2024
‘కంగువ’ సినిమా రన్ టైమ్ తగ్గింపు
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమా రన్ టైమ్ను మేకర్స్ 12 నిమిషాలు తగ్గించారు. తొలుత సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉండగా, ఇప్పుడు మళ్లీ సెన్సార్ చేయించి 2 గంటల 22 నిమిషాలకు తగ్గించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. గోవా బ్యాక్ డ్రాప్లో జరిగే కొన్ని సీన్లను తొలగించినట్లు సమాచారం. ఈనెల 14న విడుదలైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.