News November 30, 2024
నేటి నుంచి భారత్, ప్రైమ్ మినిస్టర్స్ XI వార్మప్ మ్యాచ్

BGT రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XIతో టీమ్ ఇండియా 2 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. కాన్బెర్రాలో మనుక ఓవల్ మైదానంలో ఇవాళ ఉ.9.10కు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, డిస్నీ+హాట్స్టార్ యాప్లో లైవ్ చూడవచ్చు. తొలి టెస్టులో ఆడని రోహిత్ శర్మ, గిల్ ఈ మ్యాచులో ఎలా ఆడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్లో జరగనుంది.
Similar News
News September 17, 2025
మైథాలజీ క్విజ్ – 8 సమాధానాలు

1. మైథిలి అంటే ‘సీతాదేవి’. మిథిలా నగరానికి రాజైన జనకుడి పుత్రిక కాబట్టి ఆమెను మైథిలి అని పిలుస్తారు.
2. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల ప్రధాన సైన్యాధిపతి ‘ధృష్టద్యుమ్నుడు’. ఆయన ద్రౌపదికి సోదరుడు.
3. ‘పూతన’ అనే రాక్షసిని చంపింది శ్రీకృష్ణుడు.
4. విష్ణువు శయనించే పాము పేరు ‘ఆది శేషుడు’. ఈ సర్పానికి ‘అనంత’ అనే పేరు కూడా ఉంది.
5. బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరంలో ఉంది. <<-se>>#mythologyquiz<<>>
News September 17, 2025
రేపు భారీ వర్షాలు

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News September 17, 2025
ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలి: మంత్రి

TG: ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను మంత్రి రాజనర్సింహ కోరారు. గత 9 ఏళ్లలో చేయని సమ్మె ఇప్పుడెందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. బకాయిలను చెల్లించాలనే డిమాండ్తో నెట్వర్క్ ఆస్పత్రులు ఇవాళ్టి నుంచి సేవలను <<17734028>>నిలిపివేసిన<<>> సంగతి తెలిసిందే.