News April 24, 2024

మసాలాల నిషేధంపై వివరణ కోరిన భారత్!

image

భారత్‌కు చెందిన MDH, ఎవరెస్ట్ మసాలాలను సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు నిషేధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మరో ముందడుగు పడింది. నిషేధానికి గల కారణాలను వివరించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆయా దేశాలను కోరినట్లు తెలుస్తోంది. కాగా.. అందులో పురుగు మందుల ఆనవాళ్లున్నాయని సింగపూర్, క్యాన్సర్ కారకాలున్నాయని హాంగ్‌కాంగ్ గతంలో ఆరోపించాయి.

Similar News

News October 31, 2025

అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు కోరిన స్పీకర్

image

MLAల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలలు గడువు కావాలని TG స్పీకర్ G ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.10 మంది MLAలకు నోటీసులివ్వగా 8 మంది స్పందించారు. వీరిలో 4గురి విచారణ ముగిసింది. SC విధించిన గడువు నేటితో ముగియడంతో మిగతా వారి విచారణకు సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోరారు. నోటీసులకు స్పందించని ఇద్దరిపైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. కాగా కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.

News October 31, 2025

జెమీమా రోడ్రిగ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

తాజాగా ఆస్ట్రేలియాపై జరిగిన ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో అద్భుత బ్యాటింగ్ జెమీమా రోడ్రిగ్స్ అందరి దృష్టినీ ఆకర్షించారు. ముంబైలో 2000లో జన్మించిన జెమీమా చిన్నవయసులోనే బ్యాట్ చేతబట్టింది. మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లకు కూడా ఆమె ప్రాతినిధ్యం వహించింది. కానీ చివరికి క్రికెట్‌నే ఎంచుకొంది. 2017లో అండర్-19 వన్డే మ్యాచ్‌లో సౌరాష్ట్రపై 202 పరుగులతో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళగా నిలిచింది.

News October 31, 2025

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్డీఏ మ్యానిఫెస్టో

image

➤ ప్రస్తుతం రైతులకు ఇస్తున్న రూ.6వేల పెట్టుబడి సాయం (కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి) ఏటా రూ.9వేలకు పెంపు
➤ యువతకు కోటి ఉద్యోగాల కల్పన
➤ ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన: కోటి మంది మహిళలను లక్షాధికారులు చేయడం
➤ ఈబీసీల అభివృద్ధి కోసం కులవృత్తుల వారికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం
➤ రాష్ట్రంలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, మెట్రో విస్తరణ
➤ బిహార్ నుంచి విదేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు