News January 14, 2025

మా వాళ్లను విడుద‌ల‌ చేయండి.. ర‌ష్యాను కోరిన భార‌త్

image

ర‌ష్యా సైన్యంలో ప‌నిచేస్తున్న త‌మ పౌరుల‌ విడుదలను వేగవంతం చేయాలని భార‌త్ మ‌రోసారి కోరింది. కేర‌ళ‌కు చెందిన ఓ యువ‌కుడు ఇటీవ‌ల‌ యుద్ధంలో మృతి చెంద‌గా, మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. ఈ ఘటన దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని భారత్ పేర్కొంది. కేర‌ళ యువ‌కుడి మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్టు ఎంబసీ తెలిపింది. భారతీయుల త‌ర‌లింపున‌కు ర‌ష్యా ప్ర‌భుత్వ వ‌ర్గాల‌తో చ‌ర్చిస్తున్న‌ట్టు వెల్లడించింది.

Similar News

News January 15, 2025

ఇది వెంకీ సార్ పొంగల్: అనిల్ రావిపూడి

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వస్తున్న స్పందన ఆనందం కలిగిస్తోందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. మూవీ సక్సెస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వెంకటేశ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకోవాలో తెలుసని, ఈ సంక్రాంతికి సరిగ్గా కుదిరిందని చెప్పారు. బెనిఫిట్ షోలకు ఫ్యామిలీస్ రావడం పెద్ద అచీవ్‌మెంట్ అని తెలిపారు. ఇది వెంకీ సార్ పొంగల్ అని పేర్కొన్నారు. సినిమాకు సపోర్ట్ చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.

News January 15, 2025

ఈరోజు ప్రయాణాలు చేస్తున్నారా?

image

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’ అనేది సామెత. ఇవాళ ఎలాంటి ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతారు. దీనికి కారణం పూర్వం ఎడ్ల బండ్ల మీదే ప్రయాణాలు జరిగేవి. కనుమ రోజున పశువులను పూజించి ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టొద్దని నిర్ణయించారు. అందుకే ఈరోజున ప్రయాణాలు చేయొద్దని అంటారు.

News January 15, 2025

ఆర్మీ డే ఇవాళే ఎందుకంటే?

image

భారత సైన్యాన్ని అధికారికంగా ఏప్రిల్ 1, 1895న స్థాపించారు. స్వాతంత్ర్యం తర్వాత చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ భారతదేశానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ మదప్ప కరియప్ప అనే కమాండర్‌కు ఇదే రోజున 1949లో బాధ్యతలు అప్పగించారు. దీనిని స్మరిస్తూ ప్రతి ఏటా JAN 15న ఆర్మీ డే నిర్వహిస్తున్నారు. ఈ రోజున సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వేడుకలు చేస్తారు.