News June 14, 2024

ఆర్థిక లింగ సమానత్వంలో అట్టడుగున భారత్!

image

అత్యల్ప స్థాయి ఆర్థిక లింగ సమానత్వం కలిగిన దేశాల(146) సమూహంలో భారత్ 129వ స్థానంలో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజాగా రిలీజ్ చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ డేటాలో భారత పురుషులు రూ.100 సంపాదిస్తే మహిళల సంపాదన రూ.40 మాత్రమే. దక్షిణాసియాలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తర్వాత ఇండియా ఐదో స్థానంలో ఉండగా పాకిస్తాన్ చివరి స్థానంలో ఉంది.

Similar News

News January 5, 2026

AERAIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<>AERAI<<>>)లో 9 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ(కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, బిజినెస్ ఆపరేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ స్టడీస్), CA/CMA/CWA,MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.aera.gov.in

News January 5, 2026

నీటి ప్రాజెక్టుల రుణాల కోసం CM చర్చలు

image

TG: ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా ముంబైలోని పెద్ద ఫైనాన్స్ కంపెనీతో CM రేవంత్, మంత్రి ఉత్తమ్ ఆదివారం మొదటి విడత చర్చలు జరిపారు. అయితే ఏ కంపెనీతో చర్చిస్తుందో వెల్లడి కాలేదు. ప్రాణహిత-చేవెళ్ల, ఇతర ప్రధాన ప్రాజెక్టుల కోసం భారీ నిధులు అవసరం. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ తరుణంలో RBIతో చర్చలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

News January 5, 2026

ఒత్తిడిని వదిలి ఊరి బాట పడదాం పదండి!

image

ఉరుకుల పరుగుల జీవితంలో పడి కన్నవారిని, సొంతూరిని మర్చిపోతున్నాం. ఏడాదంతా బిజీగా ఉండే మనకు పండుగలే కాస్త ఉపశమనాన్నిస్తాయి. అందుకే పండుగలకైనా పట్నం వదిలి పల్లెబాట పట్టండి. తల్లిదండ్రులతో గడిపే ఆ కాస్త సమయం వారికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలనిస్తుంది. ఆత్మీయుల మధ్య సందడిగా గడపండి. కుటుంబానికి మనం ఇచ్చే ఖరీదైన కానుక వారితో గడిపే సమయమే. మరింకేం ఈ సంక్రాంతితోనే దీనిని స్టార్ట్ చేద్దామా?