News September 30, 2024
అక్టోబర్ 12న ఉప్పల్ స్టేడియంలో భారత్-బంగ్లా మ్యాచ్

భారత్-బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 12న టీ20 మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. మొదటి టీ20 అక్టోబర్ 6న గ్వాలియర్ (మధ్యప్రదేశ్), రెండో 9న టీ20 ఢిల్లీలో, మూడో టీ20 12న HYDలో జరగనున్నాయి.
Similar News
News November 11, 2025
అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి హోం సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, సీనియర్ అధికారులు హాజరయ్యారు. J&K డీజీపీ వర్చువల్గా పాల్గొంటున్నారు.
News November 11, 2025
జడేజాను వదులుకోవద్దు: సురేశ్ రైనా

జడేజాను CSK వదులుకోనుందనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా స్పందించారు. జడేజాను కచ్చితంగా రిటైన్ చేసుకోవాలన్నారు. CSKకు అతను గన్ ప్లేయర్ అని, టీమ్ కోసం కొన్నేళ్లుగా ఎంతో చేస్తున్నారని గుర్తు చేశారు. ‘సర్ జడేజా’ జట్టులో ఉండాల్సిందే అని జట్టు యాజమాన్యానికి సలహా ఇచ్చినట్లు సమాచారం. RRతో ట్రేడ్లో జడేజా స్థానంలో CSK సంజూను తీసుకోవడం ఖరారైనట్లు క్రీడావర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే.
News November 11, 2025
కుందేళ్ల పెంపకం.. మేలైన జాతులు ఏవి?

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.


