News June 16, 2024
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్

తొలి వన్డేలో సౌతాఫ్రికా మహిళల జట్టును భారత మహిళల జట్టు చిత్తుగా ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థి ముందు 266 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనకు దిగిన సఫారీ జట్టు 37.4ఓవర్లలోనే కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (117) సెంచరీతో చెలరేగగా, బౌలింగ్‌లో ఆశా శోభన 4 వికెట్లతో పర్యాటక సౌతాఫ్రికా నడ్డి విరిచారు. దీంతో 143 పరుగుల భారీ తేడాతో భారత్ గెలిచింది.
Similar News
News September 14, 2025
తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు!

AP: గుంటూరు రూరల్(M) తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై ల్యాబ్‌లో చేసిన నీటి పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. వీటితో పాటు స్ట్రాన్షియం అనే ఎలిమెంట్, ఈకొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నీటిని తాగడం వల్లే స్థానికులు అనారోగ్యం బారిన పడినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇటీవల తురకపాలెంలో అనారోగ్యంతో పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే.
News September 14, 2025
HDFC బ్యాంకు సేవలకు అంతరాయం!

HDFC బ్యాంకు సేవలకు అంతరాయం కలుగుతోంది. UPI ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామని చాలామంది వినియోగదారులు రిపోర్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంక్ ఇంకా స్పందించలేదు. మీకు ఈ సమస్య ఎదురైందా? COMMENT
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<