News August 30, 2025
ఉక్రెయిన్‌కు టాప్ డీజిల్ సప్లయర్‌గా భారత్

ఉక్రెయిన్‌కు భారత్ టాప్ డీజిల్ సప్లయర్‌గా నిలిచినట్లు ఆయిల్ మార్కెట్ నిపుణులు తెలిపారు. 2025 జులైలో రోజుకు 2,700 టన్నుల డీజిల్ దిగుమతి చేసుకున్నట్లు పేర్కొన్నారు. 2024 జులైలో 1.9% ఉన్న దిగుమతులు ఒక్క ఏడాదిలోనే 15.5%కి ఎగబాకాయన్నారు. రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు కావాల్సిన ఎకానమీ సపోర్ట్‌కు ఈ డీజిల్ దిగుమతులు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
Similar News
News August 31, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 31, 2025
నేడు, రేపు వర్షాలు

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, MHBD, WGL, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
News August 31, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 31, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.48 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
✒ ఇష: రాత్రి 7.44 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.