News February 19, 2025

ఫైనల్లో 100 ఓవర్లు వేసిన ఇండియా.. కానీ(2/2)

image

దీంతో మరోసారి శ్రీలంక మొదట బ్యాటింగ్ చేయగా 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 222 పరుగులే చేసింది. ఛేదనలో భారత జట్టు 8.4 ఓవర్లలో 38/1 పరుగులు చేయగా వర్షం కారణంగా ఆట సాధ్యపడలేదు. దీంతో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. రెండు రోజులు కలిపి భారత బౌలర్లు 100 ఓవర్లు వేశారు. ఈ టోర్నీలో సెహ్వాగ్(271) అత్యధిక పరుగులు చేయడం గమనార్హం. ఆ తర్వాత 11 ఏళ్లకు ధోనీ సారథ్యంలోని భారత జట్టు ట్రోఫీని నెగ్గింది.

Similar News

News November 18, 2025

మూవీ ముచ్చట్లు

image

*కల్ట్ క్లాసిక్ సినిమా ‘షోలే’ డిసెంబర్ 12న థియేటర్లలో రీరిలీజ్‌ కానుంది.
*మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. పూజా కార్యక్రమంతో హారర్ చిత్రం ప్రారంభం. సమర్పకుడిగా వ్యవహరించనున్న నీల్.
* ‘వారణాసి’ వీడియోకు అద్భుత స్పందన రావడంతో సాంకేతిక బృందానికి థాంక్స్ చెప్పిన రాజమౌళి. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ ట్వీట్.

చావడానికి సిద్ధంగా ఉన్నా: యువరాజ్ తండ్రి

image

తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. తన స్వగ్రామంలో ఒంటరిగా గడుపుతున్నానని, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ప్రేమిస్తానని, ఎవరినీ సాయం అడగనని చెప్పారు. తాను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని, కానీ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వృద్ధాప్యంలో ఎవరూ తోడుగా లేరని వాపోయారు.