News October 21, 2024
భారత్, బ్రెజిల్కు UNSCలో శాశ్వత సభ్యత్వం ఉండాలి: రష్యా

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై భారత్కు రష్యా మద్దతుగా నిలిచింది. ‘భారత్, బ్రెజిల్తో సహా ఆఫ్రికా దేశాలకు కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉండాలి. మెజార్టీ వర్గం తరఫున ప్రాతినిధ్యం ఉండటం ఎంతో అవసరం’ అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. చైనా మినహా ఈ మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న బ్రిటన్, US, ఫ్రాన్స్ దేశాలు ఇప్పటికే భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలని ఉద్ఘాటించాయి.
Similar News
News September 18, 2025
అనకాపల్లి జిల్లాకు 18వేల టన్నుల యూరియా సరఫరా

అనకాపల్లి జిల్లాలో రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘాలకు ఇంతవరకు 18వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్రావు బుధవారం తెలిపారు. మత్సవానిపాలెం రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన సమీక్షించారు. జిల్లాలో ఆహార, వాణిజ్య, ఉద్యానవన పంటలు 1,41,000 హెక్టార్లలో సాగులో ఉన్నాయని చెప్పారు. వీటికి అక్టోబర్ నెల మొదటి వారం వరకు 20 వేల టన్నుల యూరియా అవసరమన్నారు.
News September 18, 2025
మళ్లీ భారత్vsపాకిస్థాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?

ఆసియా కప్-2025లో భారత్vsపాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో ఈ ఆదివారం (Sep 21) రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. కాగా గ్రూప్-A నుంచి భారత్, పాక్ సూపర్-4కు క్వాలిఫై అయ్యాయి. సూపర్-4లో ఒక్కో జట్టు 3 మ్యాచులు ఆడనుంది. అటు గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ సూపర్-4 రేసులో ఉన్నాయి.
News September 18, 2025
భారత్ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రం.. ట్రంప్ తీవ్ర ఆరోపణ

భారత్, చైనా, పాక్ సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ దేశాలు డ్రగ్స్, వాటి తయారీకి కావాల్సిన రసాయనాలను ఉత్పత్తి, రవాణా చేస్తూ US ప్రజల భద్రతకు ప్రమాదంగా మారాయని విమర్శించారు. అఫ్గాన్, మెక్సికో, హైతీ, కొలంబియా, పెరూ, పనామా, బొలీవియా, బర్మా వంటి దేశాలు ఈ లిస్ట్లో ఉన్నాయి. US కాంగ్రెస్కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్లో ఈ ఆరోపణలు చేశారు.