News September 23, 2024
లౌకికవాదం భారత్కు అవసరం లేదు: తమిళనాడు గవర్నర్

లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు ‘మోసం’ జరిగిందని తమిళనాడు గవర్నర్ RN రవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. లౌకికవాదం భారతదేశంలో అవసరం లేదన్నారు. ‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి. లౌకికవాదాన్ని తప్పుగా అభివర్ణించడం వాటిలో ఒకటి. లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు. ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య ఘర్షణ వల్ల సెక్యులరిజం పుట్టింది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 23, 2025
జనగామ: మెడికల్ కళాశాలలో ఉద్యోగాలు

జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలతో జిల్లా ఏరియా ఆసుపత్రిలో ప్రొఫెసర్స్(4), అసోసియేట్ ప్రొఫెసర్స్(12), అసిస్టెంట్ ప్రొఫెసర్స్(13), సీనియర్ రెసిడెంట్(23) పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగమణి తెలిపారు. నవంబరు 5వ తేదీలోపు ఎంసీహెచ్ ఆసుపత్రిలో దరఖాస్తు చేసుకోవాలని, అదే రోజు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
News October 23, 2025
మహిళా శక్తి.. ప్రశంసించాల్సిందే!

నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం సజావుగా నడుస్తోంది. ఈ క్రమంలో ఇంటి పని, ఆఫీస్ ఒత్తిడి, కుటుంబాన్ని చక్కదిద్దే బహుముఖ పాత్రను పోషిస్తున్న మహిళల కృషి అసాధారణమైనది. ఆఫీసు పనితో పాటు ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనా పాలన చూసుకోవడం అంత తేలిక కాదు. ఈ సవాళ్లు అలసట కలిగించినా, తన ప్రేమ, బలం, దృఢ సంకల్పంతో ఆమె అన్నిటినీ సమన్వయం చేస్తోంది. నిజంగా, మహిళే ఆ కుటుంబానికి గుండెకాయ!
News October 23, 2025
₹6500 కోట్లతో పల్లె పండుగ 2.0

AP: గ్రామాల రూపురేఖలు మార్చేలా పల్లె పండుగ-2.0కు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికోసం ₹6500 కోట్లతో 52వేల పనులు చేపట్టి సంక్రాంతికి పూర్తి చేసేలా ప్లాన్ రూపొందిస్తోంది. ఈనెలాఖరు లేదా నవంబర్ తొలివారంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. గతేడాది ఇదే ప్రోగ్రాం కింద ₹4500 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి కూడా గతంలో మాదిరి రోడ్లు, కాలువలు, గోకులాలతో పాటు 1107 పంచాయతీల్లో మ్యాజిక్ డ్రెయిన్ ఇతర పనులు చేపట్టనున్నారు.