News November 24, 2024
భారీ స్కోర్‌పై భారత్ కన్ను
BGTలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు 2వ ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుపై భారత్ కన్నేసింది. జైస్వాల్(90), KL రాహుల్(62) రాణింపుతో 172/0తో పటిష్ఠమైన స్థితిలో రెండో రోజు ఆట ముగించింది. ప్రస్తుతం 218 లీడ్‌లో ఉన్న భారత్ 3వ రోజంతా బ్యాటింగ్ చేసి కంగారూల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆసీస్‌పై ఒత్తిడి పెరిగే ఛాన్సుంది. మరి భారత్ ఎంత స్కోర్ కొడుతుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.
Similar News
News November 24, 2024
ఎంత ఘోరం.. 5ఏళ్ల కూతురిని చంపిన తల్లి.. కారణమిదే!
ఢిల్లీలోని అశోక్‌విహార్‌లో అమానవీయ ఘటన జరిగింది. HPకి చెందిన ఓ మహిళను భర్త విడిచి పెట్టగా ఢిల్లీకి చెందిన మరో వ్యక్తితో ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేమలో పడింది. ప్రియుడి కోసం ఢిల్లీ వెళ్లగా అసలు కథ మొదలైంది. ఆ మహిళకు అత్యాచార బాధితురాలైన కూతురు(5) ఉంది. కాగా ఆ చిన్నారితో కలిసి ఉండటం కుదరదని సదరు ప్రియుడు ఆమెను తిరస్కరించాడు. ఈక్రమంలోనే ప్రియుడి కోసం కూతుర్ని మహిళ హతమార్చింది. కేసు నమోదైంది.
News November 24, 2024
ఎమ్మెల్యేలతో శిండే అత్యవసర భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముంబైలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ విధిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. కాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శిండే ఈ భేటీ నిర్వహించడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
News November 24, 2024
INDvsUS ఓట్ల కౌంటింగ్.. మస్క్ రియాక్షన్ ఇదే
ఓట్ల లెక్కింపు విషయంలో భారత్‌తో అమెరికాను పోలుస్తూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ఇండియాలో ఒకే రోజు 640 మిలియన్ల ఓట్లు లెక్కిస్తే USలోని కాలిఫోర్నియాలో మాత్రం కేవలం 15 మిలియన్ల ఓట్లను 18 రోజుల నుంచి ఇంకా లెక్కిస్తూనే ఉన్నారన్నది ఆ ట్వీట్ సారాంశం. దీనిపై ‘విషాదం’ అని ఎలాన్ మస్క్ రియాక్టయ్యారు. కాలిఫోర్నియాలో కమలా హారిస్‌ను విజేతగా ఏజెన్సీలు ప్రకటించినా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.