News March 11, 2025
2027 నాటికి భారత్‌లో భారీగా ఏఐ నిపుణుల కొరత

వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా ఎదిగేందుకు భారత్ సిద్ధంగా ఉందని బెయిన్ అండ్ కంపెనీ అంచనా వేసింది. అయితే దేశంలో ఏఐ నిపుణుల కొరత పెరుగుతోందని తెలిపింది. 2027 నాటికి 10 లక్షలకు పైగా నిపుణుల కొరత ఉండొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఉద్యోగ అవకాశాలు 23 లక్షలు దాటొచ్చని పేర్కొంది. ఏఐకి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉందని తెలిపింది.
Similar News
News November 26, 2025
26/11: మానవత్వం చాటుకున్న రతన్ టాటా!

ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా ఆర్మీ అధికారులకు అందించిన సపోర్ట్‌ను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన 3 రోజులు తాజ్ హోటల్ వెలుపలే నిలబడి సహాయక చర్యల్లో భాగమై మానవత్వాన్ని చాటారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆస్తినష్టం జరిగినా పర్లేదని ఆర్మీని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, బాధితుల కుటుంబాలకు ఆయన చికిత్స అందించి ఆర్థికంగా కూడా మద్దతుగా నిలిచారు.
News November 26, 2025
దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్!

హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తృతపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ORR వరకు, అవతలి వైపు ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలనూ గ్రేటర్‌గా పరిగణించనుంది. 1,2 నెలల్లో డివిజన్లు, కార్పొరేషన్ల విభజన పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.
News November 26, 2025
18 ఏళ్ల యువతను గౌరవిద్దాం: మోదీ

ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత పౌరులపై ఉందని PM మోదీ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ‘18ఏళ్లు నిండి, తొలిసారి ఓటు వినియోగించుకునే యువతను ఏటా NOV 26న విద్యాసంస్థల్లో గౌరవించాలి. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయన్న గాంధీ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ వైపు అడుగులు వేయాలి’ అని పేర్కొన్నారు.


