News January 29, 2025
కెనడాకు పంచ్ ఇచ్చిన భారత్

కెనడాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తమ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందన్న రిపోర్టును ఖండించింది. నిజానికి వాళ్లే భారత అంతర్గత వ్యవహారాల్లో నిరంతరం జోక్యం చేసుకుంటారని ఎదురుదాడి చేసింది ‘ఆ రిపోర్టు అబద్ధాల పుట్ట. వ్యవస్థీకృత నేరాలు, అక్రమ వలసదారులకు అనువైన వాతావరణాన్ని ఇది సృష్టిస్తోంది. మాపై ఆరోపణలను ఖండిస్తున్నాం. ఇకపై అక్రమ వలసదారులను ప్రోత్సహించకుండా ఉంటారని ఆశిస్తున్నాం’ అని MEA తెలిపింది.
Similar News
News December 1, 2025
కేరళ సీఎంకు ED నోటీసులు

2019 మసాలా బాండ్ల జారీ కేసులో కేరళ సీఎం పినరయి విజయన్కు ED నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటు ఆయన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎం అబ్రహం, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఇస్సాక్కు నోటీసులిచ్చింది. రూ.468 కోట్ల ట్రాన్సాక్షన్స్లో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘించారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమీకరించే ప్లాన్లో భాగంగా ఈ బాండ్లను జారీ చేశారు.
News December 1, 2025
పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.
News December 1, 2025
Karnataka: మరోసారి ‘బ్రేక్ ఫాస్ట్’ మీటింగ్?

కర్ణాటక ‘CM’ వివాదం నేపథ్యంలో సిద్దరామయ్య, DK శివకుమార్ కలిసి <<18419745>>బ్రేక్ఫాస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 9.30కు బెంగళూరులో మరోసారి వారిద్దరూ భేటీ అవుతారని తెలుస్తోంది. సిద్దరామయ్యను శివకుమార్ ఆహ్వానించారని సమాచారం. తొలి మీటింగ్ సిద్దరామయ్య నివాసంలో జరగ్గా, రెండోది శివకుమార్ ఇంట్లో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరు నేతలు ఇప్పటికే ప్రకటించారు.


