News August 19, 2024
మధ్యవర్తిత్వం వార్తలను తోసిపుచ్చిన భారత్

రష్యా – ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి భారత్ మధ్యవర్తిత్వం వహించనుందనే వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. అయితే, తాము రెండుదేశాల మధ్య సందేశాలను చేరవేయడంలో సహకరించగలమని చెప్పింది. ప్రధాని మోదీ ఆగస్టు 23న కీవ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల రష్యా వెళ్లి వచ్చిన ఆయన తాజాగా కీవ్ పర్యటన నేపథ్యంలో మధ్యవర్తిత్వం వార్తలు జోరందుకున్నాయి.
Similar News
News November 25, 2025
తిరుమల పరకామణి కేసు.. భూమనకు నోటీసులు

AP: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు అందజేశారు.
News November 25, 2025
మహిళలపై హింసకు అడ్డుకట్ట వేద్దాం

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఆకాశానికెగసినా ఇంట్లో జరిగే హింసను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ఆడవాళ్లకు సరైన అవగాహన కల్పించాలనీ, వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఐరాస ఏటా నవంబర్ 25న ‘మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. భారత్లో దాదాపు 30శాతం మహిళలు సన్నిహిత భాగస్వామి నుంచే హింసను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది.
News November 25, 2025
హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వాల చేయూత

గృహహింసకి సంబంధించి జాతీయ మహిళా కమిషన్ వాట్సప్ నెంబర్: 72177-35372తో పాటు ఆ సంస్థ వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బాధితులు 181, 1091, 100 నంబర్లకు ఫోన్ చేస్తే తక్షణం పోలీస్ సాయం అందుతుంది. స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేసే వ్యవస్థలు ఉన్నాయి. వీటితో పాటు ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసి, రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.


