News August 5, 2025

ఇండియాకు ఆ హక్కు ఉంది: రష్యా

image

ఆయిల్ దిగుమతులపై US బెదిరింపుల నేపథ్యంలో రష్యా భారత్‌కు మద్దతుగా నిలిచింది. ‘ట్రేడ్, ఎకనామిక్ సహకారం కోసం పార్ట్‌నర్స్‌ను ఎంచుకోవడం ఆయా దేశాల ఇష్టం. ఇది వారి హక్కు. ఇందుకు విరుద్ధంగా US చేస్తున్న ప్రయత్నాలు, హెచ్చరికలు లీగల్ కాదు’ అని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆక్షేపించారు. కాగా టారిఫ్స్ భారీగా పెంచుతానన్న ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఇప్పటికే స్ట్రాంగ్ <<17305975>>కౌంటర్<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News August 5, 2025

డా.నమ్రత కేసులో సంచలన విషయాలు

image

TG: ‘సృష్టి’ ఫేక్ సరోగసీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ మోసాలపై పోలీసులు ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాతో డా.నమ్రతకు సంబంధాలున్నట్లు గుర్తించారు. ఏజెంట్ల సాయంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు తేల్చారు. అస్సాం, బిహార్, ముంబై, రాజస్థాన్ నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 80 ఫేక్ సరోగసీ కేసులు చేశామని నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

News August 5, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే ఆస్కారం ఉన్నందున చెట్ల కింద నిలబడరాదని సూచించింది.

News August 5, 2025

సినీ కార్మికుల సమ్మెను తప్పుబట్టిన విశ్వప్రసాద్

image

టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘స్కిల్ లేకుండా జీతాలు పెంచి ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారమే. కొన్ని క్రాఫ్ట్స్ వాళ్లు రోజుకు గంట పనిచేసినా ఫుల్ వేతనం ఇస్తున్నాం. స్కిల్స్ ఉన్నప్పటికీ యూనియన్ మెంబర్స్ కాకపోవడంతో ముంబై నుంచి అధికంగా చెల్లించి తీసుకొస్తున్నాం. ఈ సిస్టమ్‌ మార్చాలి. నచ్చిన వాళ్లతో పనిచేయించుకునే హక్కు మాకు ఉంది’ అని చెప్పారు.