News November 24, 2024
పట్టు బిగించిన భారత్.. ఆసీస్ 12/3

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులకే 3 వికెట్లు కూల్చేసింది. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. విజయం కోసం ఆసీస్ ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 487/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 5, 2026
నల్లమల సాగర్‌పై అభ్యంతరాలెందుకు: రోహత్గి

పోలవరం, నల్లమల సాగర్‌పై SCలో విచారణ <<18768178>>వాయిదా<<>> పడిన విషయం తెలిసిందే. AP తరఫున ముకుల్ రోహత్గి, జగదీప్ గుప్తా వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర భూభాగంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నీటిని తరలించడంపై అభ్యంతరాలు ఎందుకు? నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి పక్కింటి వాళ్ల పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదు’ అని TGని ఉద్దేశించి ముకుల్ రోహత్గి వ్యాఖ్యానించారు.
News January 5, 2026
నాభిలో ‘సూక్ష్మ’ ప్రపంచం.. ఇంత కథ ఉందా?

మన శరీరం అద్భుత నిలయం. అందులోనూ మన నాభి మరింత ప్రత్యేకం. ఇందులో వేలాది సూక్ష్మజీవులు నివసిస్తాయనే విషయం మీకు తెలుసా? మన నాభిలో ఏకంగా 2,368 రకాల సూక్ష్మజీవులు ఉంటాయని US నేషనల్ జియోగ్రాఫిక్ పరిశోధనలో తేలింది. స్నానం చేసినా వాటిని తొలగించలేం. విచిత్రమేంటంటే ఇందులో 1,458 జాతులు శాస్త్రవేత్తలకు కూడా కొత్తే. వేలిముద్రల్లాగే ఒకరి బొడ్డులోని బ్యాక్టీరియా మరొకరి దాంట్లో ఉండదని వారు చెబుతున్నారు.
News January 5, 2026
ఆ తెలంగాణ ప్రాజెక్టులు నేనే నిర్మించా: CBN

AP:TGలో కృష్ణా నదిపై కల్వకుర్తి, AMR లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు ప్రాజెక్టులను తానే నిర్మించానని CM CBN తెలిపారు. ‘APలో కృష్ణా డెల్టా మోడ్రనైజేషన్‌తో పొదుపుచేసిన 20 TMCల నీటిని TGకి ఇచ్చి భీమా లిఫ్ట్‌ను పూర్తి చేయించా. గోదావరిపై TGలో గుప్త, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతలు తెచ్చా. APలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి చేపట్టాం. 2014లో పట్టిసీమ చేపట్టాం’ అని గుంటూరులో తెలుగు మహాసభల్లో వివరించారు.


