News August 26, 2024
టెలిగ్రామ్‌పై భారత్ విచారణ.. అక్రమాలు తేలితే నిషేధం

గ్యాంబ్లింగ్, మోసాలు, నేరపూరిత కార్యకలాపాలకు సహకరిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్‌పై భారత ప్రభుత్వం విచారణ చేస్తోంది. యాప్‌లో P2P(పర్సన్ టు పర్సన్) కమ్యూనికేషన్లను సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిశీస్తున్నట్లు ఓ GOVT అధికారి వెల్లడించారు. దర్యాప్తు తర్వాత అక్రమాలు తేలితే యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉందని తెలిపారు. యాప్ ఫౌండర్ దురోవ్‌ను ఫ్రాన్స్ పోలీసులు <<13941531>>అరెస్టు<<>> చేసిన విషయం తెలిసిందే.
Similar News
News August 30, 2025
ట్రెండింగ్: TRUMP IS DEAD

X (ట్విటర్)లో TRUMP IS DEAD అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ట్రంప్ వైట్‌హౌస్‌లో కనిపించకపోవడంతో కొందరు X వేదికగా ఈ పోస్టులు చేస్తున్నారు. ట్రంప్ CVI వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనికి తోడు దేశంలో ‘టెర్రిబుల్ ట్రాజెడీ’ సంభవిస్తే తాను అధ్యక్ష బాధ్యతలకు సిద్ధంగా ఉన్నట్లు వైస్ ప్రెసిడెంట్ వాన్స్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రూమర్లను వైట్‌హౌస్ ఖండించింది.
News August 30, 2025
యూరియా కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం: హరీశ్‌రావు

TG: రాష్ట్రంలో యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘కొరతకు కారణం కేంద్రమో, రాష్ట్రమో తేల్చుకుందాం. యూరియా సమస్యను పరిష్కరించాల్సిందే. లేదంటే అప్పటివరకు అసెంబ్లీని స్తంభింపజేస్తాం. యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం’ అని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన వెల్లడించారు.
News August 30, 2025
సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది.