News February 24, 2025

సౌరశక్తిలో భారత్ సూపర్ పవర్: ప్రధాని మోదీ

image

ఆర్థిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా IND కొనసాగుతోందని వరల్డ్ బ్యాంక్ కొనియాడిందని PM మోదీ వెల్లడించారు. సౌరశక్తిలోనూ ఇండియా సూపర్ పవర్‌గా మారిందని UN ప్రశంసించిందన్నారు. MPలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో PM ప్రసంగించారు. ఇతర దేశాలు మాటలకే పరిమితమైతే భారత్ చేసి చూపిందని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తే ఎకానమీ గ్రోత్, ఉద్యోగాల కల్పనకు దారి ఏర్పడుతుందన్నారు.

Similar News

News January 27, 2026

ఖాళీ కానున్న 4 రాజ్యసభ సీట్లు… ఎవరికి ఎన్ని?

image

AP: జూన్‌లో రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో TDP 1, YCP 3 ఉన్నాయి. బడ్జెట్ సెషన్స్‌లో లేదా తర్వాత వీటికి ఎన్నిక ఉంటుంది. సంఖ్యా బలాన్ని బట్టి ఇవన్నీ కూటమికే దక్కనున్నాయి. వీటిలో 1 BJPకి కేటాయించొచ్చన్న ప్రచారముంది. జనసేన కోరితే 1 ఇచ్చి మిగతా 2 TDP తన వారికి ఇవ్వొచ్చని తెలుస్తోంది. కాగా కౌన్సిల్‌లో ఖాళీ అయ్యే MLC సీట్లలో JSP వాటా అడిగితే RS సీటు ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు.

News January 27, 2026

ప్రభుత్వ ఆలోచనలను హైడ్రా ఆచరణలో పెడుతోంది: రేవంత్

image

TG: HYD ఆస్తులు, విపత్తుల టైంలో ప్రాణాలు కాపాడటంలో హైడ్రాపాత్ర అభినందనీయమని CM రేవంత్ ప్రశంసించారు. ‘ప్రభుత్వ ఆస్తులు కాపాడటంతో పాటు చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రజా ప్రభుత్వం ఆలోచనలను హైడ్రా ఆచరణలో పెడుతోంది. ఆ క్రమంలో మీర్ ఆలం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఇంజినీర్లు, కార్మికులు అనుకోని ఆపదలో చిక్కుకున్నారు. వారి ప్రాణాలు కాపాడిన హైడ్రా సిబ్బందికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

News January 27, 2026

ఎన్నికల కోడ్.. రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్తున్నారా?

image

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో <<18975094>>కోడ్ అమల్లోకి<<>> వచ్చింది. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్ఠంగా రూ.50వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లాలి. అంతకంటే ఎక్కువ నగదు, విలువైన వస్తువులు(బంగారం, వెండి) ఉంటే ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆధారాలు చూపాలి. లేదంటే సీజ్ చేస్తారు. ఆ సమయంలో పోలీసులు రిసీట్ ఇస్తారు. తర్వాత అప్పీల్ చేసుకొని ఆధారాలు చూపితే నగదును తిరిగిస్తారు.