News February 22, 2025

టర్కీ అధ్యక్షుడిపై భారత్ ఆగ్రహం

image

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఇటీవల పాక్‌లో పర్యటించినప్పుడు కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని, ప్రజల ఆశల్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ఆ మాటలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ‘కశ్మీర్ అనేది పూర్తిగా మా సార్వభౌమత్వంలోనిది. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. టర్కీ రాయబారి వద్ద మా నిరసనను వ్యక్తం చేశాం’ అని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.

Similar News

News February 4, 2026

మమత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఈసీకి నోటీసులు

image

బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ కోసం భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ప్రక్రియ వల్ల లక్షలాది మంది ఓటర్ల హక్కులకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ CM మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ECIకి నోటీసులిచ్చింది. ముఖ్యమంత్రే స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు. ఒక సిట్టింగ్ సీఎం ఇలా నేరుగా కోర్టులో వాదించడం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి.

News February 4, 2026

రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

image

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్‌ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.

News February 4, 2026

SBIలో 2,273 ఉద్యోగాలు

image

SBIలో 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 21-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ ఉన్న వారికి వయసులో సడలింపు ఉంటుంది. స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు FEB 18 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in