News April 30, 2024
‘వాషింగ్టన్ పోస్ట్’పై భారత్ ఆగ్రహం

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూపై జరిగిన హత్యాయత్నంలో భారత్ ప్రమేయం ఉందంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రచురించిన కథనంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఒక సున్నితమైన అంశంపై సదరు పత్రిక నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. ఉగ్రవాదులు, నేరగాళ్లపై అమెరికా సర్కారు అందించిన వివరాల పరిశీలనకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశాం. దర్యాప్తు జరుగుతోంది. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఏ ఉపయోగమూ లేదు’ అని మండిపడింది.
Similar News
News March 11, 2026
వచ్చే నెలలో Xలో పేమెంట్ ఆప్షన్?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో త్వరలో ఫోన్ పే, గూగుల్ పే తరహాలో పేమెంట్ ఆప్షన్స్ రానున్నాయి. వచ్చే నెలలో పరిమిత యూజర్లకు దీని ఎర్లీ యాక్సెస్ అందుబాటులో ఉంటుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనిపై X ఇప్పటికే వీసా సంస్థతో టైయప్ అయింది. కాగా Xను SM కంటే ఫైనాన్స్‌కు ప్రాధాన్యం ఉన్న ప్లాట్‌ఫామ్‌గా మారుస్తానని మస్క్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ట్రయల్స్ ఓకే అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.
News March 10, 2026
గ్యాస్ కొరత.. మొబైల్, ఇంటర్నెట్‌పై ఎఫెక్ట్?

LPG కొరతతో మొబైల్, ఇంటర్నెట్ సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. టెలికాం టవర్ తయారీ సంస్థలకు గ్యాస్ సప్లై నిలిచిపోవడమే ఇందుకు కారణం. టెలికం టవర్లు తుప్పుపట్టకుండా తయారీ సమయంలో జింక్‌తో వేసే రక్షణ పొరకు LPG/LNG అవసరం. ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్‌కు తగిన LPG లేకపోతే ఆపరేషన్స్ నిలిపివేయాల్సి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీంతో నెట్‌వర్క్ విస్తరణ నెమ్మదించి కనెక్టివిటీపై ప్రభావం పడుతుందని తెలిపారు.
News March 10, 2026
రణ్‌వీర్ అప్‌కమింగ్ మూవీపై క్రేజీ అప్‌డేట్!

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ రణ్‌వీర్ సింగ్ నెక్స్ట్ మూవీపై ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రణ్‌వీర్ ఈసారి ‘ప్రళయ్’ పేరుతో ఓ జాంబీ థ్రిల్లర్‌లో నటించనున్నారు. ఇలాంటి సినిమాను భారత్‌లో ఎవరూ తీయలేదని.. కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఉంటుందని డైరెక్టర్ జై మెహతా చెప్పడంతో అంచనాలు పెరిగాయి. రణ్‌వీర్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.


