News November 30, 2024
ఆస్ట్రేలియా వీసా ఫీజు పెంపుపై భారత్ ఆందోళన

అంతర్జాతీయ విద్యార్థుల వీసా ఫీజును ఆస్ట్రేలియా సుమారు రూ.38,930 నుంచి రూ.87,731కి పెంచడంపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భారత విద్యార్థులపై ఈ నిర్ణయం ఆర్థిక భారం మోపుతుందని ఆస్ట్రేలియా అధికారులకు చెప్పినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభలో తెలిపారు. కాగా.. గత ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్యలో చదువుకోసం 1.22లక్షలమంది భారతీయులు ఆస్ట్రేలియాను ఎంచుకున్నారు.
Similar News
News January 19, 2026
బీరువాలో అస్సలు ఉండకూడని 4 వస్తువులు!

వాస్తు శాస్త్రం ప్రకారం బీరువా మహాలక్ష్మి నివసించే స్థలం. అందుకే అక్కడ కొన్ని వస్తువులు ఉండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ‘బీరువాలో పెర్ఫ్యూమ్స్ ఉంచితే ఆర్థిక నష్టం, అనారోగ్యం కలుగుతాయి. అల్మారాలో అద్దం ఉండకూడదు. చిరిగిన కాగితాలు, నల్లటి వస్తువులు, నల్లటి బట్టల్లో డబ్బును దాచడం వల్ల కూడా సంపద హరిస్తుంది. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి’ అంటున్నారు.
News January 19, 2026
MOIL లిమిటెడ్లో 67 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News January 19, 2026
థైరాయిడ్ నార్మల్గా ఉంటే మందులు మానేయొచ్చా?

చాలామంది థైరాయిడ్ లెవల్స్ నార్మల్గా ఉన్నాయని మందులు వాడటం మానేస్తారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. మందులు వాడటం వల్లే థైరాయిడ్ నార్మల్గా ఉంటుందంటున్నారు. అయితే 12.5- 25mg వాడేవారు వీటిని 6వారాల తర్వాత పరీక్షించుకొని నార్మల్గా ఉంటే మందులు వాడటం మానేయొచ్చని సూచిస్తున్నారు. అయితే థైరాయిడ్ సమస్య అదుపులో ఉన్నట్టు కచ్చితంగా నిర్ధారణ అయ్యాక, అదీ డాక్టర్ సలహాతోనే మందులు ఆపాలని చెబుతున్నారు.


