News October 4, 2025

భారత్ నా మాతృభూమి: పాక్ మాజీ క్రికెటర్

image

తాను భారత సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలను పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఖండించారు. పాక్ ప్రభుత్వం, PCB తనపై ఎంత వివక్ష చూపినా ఇక్కడి ప్రజలు మాత్రం ఎంతో ప్రేమించారని చెప్పుకొచ్చారు. పాక్ తన జన్మభూమి అయితే, భారత్ మాతృభూమి అని ట్వీట్ చేశారు. ఇండియా ఒక దేవాలయమని అభివర్ణించారు. భవిష్యత్తులో ఆ దేశ సిటిజన్‌షిప్ కావాలనుకుంటే అందుకోసం CAA అమల్లో ఉందని గుర్తు చేశారు.

Similar News

News October 5, 2025

అక్టోబర్ 5: చరిత్రలో ఈరోజు

image

1911: నటి పసుపులేటి కన్నాంబ జననం (ఫొటోలో లెఫ్ట్)
1975: హాలీవుడ్ నటి కేట్ విన్‌స్లెట్ జననం
2001: ఖాదీ ఉద్యమ నాయకురాలు కల్లూరి తులశమ్మ మరణం
2011: యాపిల్ సంస్థ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణం (ఫొటోలో రైట్)
1864: కలకత్తాలో సంభవించిన పెను తుఫానులో 60,000 మందికి పైగా మృతి
* ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం

News October 5, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 05, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.23 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
✒ ఇష: రాత్రి 7.14 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 5, 2025

‘పూర్వోదయ స్కీమ్‌’ను సద్వినియోగం చేసుకోవాలి: CM

image

AP: కేంద్రం ప్రారంభించిన పూర్వోదయ స్కీమ్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని CM చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించాల్సిన ప్రణాళికలపై సమీక్షించారు. ఉద్యాన పంటలు, ఫిషరీస్, ఆక్వా తదితర రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలని, సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పాలన్నారు.