News May 3, 2024
వన్డేలు, టీ20ల్లో భారత్ నంబర్-1
ICC ఇవాళ ప్రకటించిన వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ వన్డేలు, టీ20ల్లో నంబర్-1గా నిలిచింది. టెస్టుల్లో నంబర్-2గా ఉంది. టెస్టుల్లో టీమ్ ఇండియాను వెనక్కి నెట్టి ఆసీస్ నంబర్-1 స్థానానికి చేరింది.
*టెస్టులు: ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్
*వన్డేలు: భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్
*టీ20లు: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్
Similar News
News December 26, 2024
విరాళాల్లో బీజేపీ తర్వాత బీఆర్ఎస్సే!
2023-24 ఏడాదికి పొందిన అత్యధిక విరాళాల విషయంలో బీఆర్ఎస్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈసీ వెబ్‌సైట్ ప్రకారం.. విరాళాల రూపంలో BJP అత్యధికంగా రూ.2244 కోట్లను పొందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 3రెట్లు అధికం. ఇక తర్వాతి స్థానంలో రూ.495.5 కోట్లతో BRS నిలిచింది. కాంగ్రెస్ రూ.288.9 కోట్లు పొందింది. YSRCP 121.5 కోట్లు, DMK రూ.60 కోట్లు పొందినట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వెల్లడించాయి.
News December 26, 2024
గుకేశ్‌ను సత్కరించిన సూపర్ స్టార్
వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా అవతరించిన భారత చెస్ ప్లేయర్ గుకేశ్ దొమ్మరాజును సూపర్ స్టార్ రజినీకాంత్ అభినందించారు. గుకేశ్ కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించిన రజినీ, సత్కరించి వారితో కొంత సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా తమను ఆహ్వానించినందుకు రజినీకాంత్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ గుకేశ్ ట్వీట్ చేశారు. అలాగే హీరో శివ కార్తికేయన్‌ను కూడా ఆయన కలువగా దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు.
News December 26, 2024
శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు: సీఎం
సినీ పరిశ్రమకు అండగా ఉంటామంటూనే ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదన్నారు. హీరోల ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుందని, సొసైటీకి ఆదర్శంగా వారి ప్రవర్తన ఉండాలని సూచించారు. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత అల్లు అరవింద్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సంధ్య థియేటర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు.