News May 22, 2024
ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్కు 39వ స్థానం

ప్రపంచ ఆర్థిక వేదిక(WEF) ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024లో భారత్ 39వ స్థానం పొందింది. తొలి స్థానంలో అమెరికా నిలువగా.. స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వ్యయాల పరంగా మన దేశానికి 18వ ర్యాంక్, విమాన రవాణాలో 26వ స్థానం, రోడ్లు- నౌకాశ్రయాల మౌలిక వసతుల్లో 25వ స్థానం లభించింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కొవిడ్ ముందు స్థాయికి చేరినట్లు WEF నివేదిక పేర్కొంది.
Similar News
News October 21, 2025
ఆక్వా రైతులకు శుభవార్త చెప్పిన లోకేశ్

AP: ఆక్వా రైతులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు తెల్లమచ్చ వైరస్ కారణంగా పొట్టు తీయని రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా పరిమితులు విధించగా తాజాగా వాటిని ఎత్తివేసి ఎగుమతులకు అనుమతించిందని మంత్రి చెప్పారు. దీనికోసం కృషిచేసిన ఇండియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కొత్త మార్కెట్లకు విస్తరించాల్సిన అవసరముందని ఇది నిరూపిస్తోందని వివరించారు.
News October 21, 2025
తరింపజేసే పంచమహామంత్రాలు

మనః అంటే మనసు, త్ర అంటే రక్షించేది. మనసును రక్షించేదే మంత్రం. ఇది దైవస్వరూపం. మంత్రం ఉచ్చరించినపుడు అందులో నాదబలం మనసును శాంతపరచి, ఆత్మను ఉన్నతస్థితికి తీసుకెళ్తుంది. పంచమహామంత్రాలివే..
1.ఓంనమఃశివాయ- పంచాక్షరీమంత్రం 2.ఓం నమో నారాయణాయ-అష్టాక్షరీమంత్రం 3.ఓం నమో భగవతే వాసుదేవాయ-ద్వాదశాక్షరీ మంత్రం, 4.ఓంభూర్భువఃస్వహ-గాయత్రీ మంత్రం, 5.ఓంత్రయంబకం యజామహే-మహామృత్యుంజయ మంత్రం.
News October 21, 2025
మహిళలు రోజుకొక ఆరెంజ్ తింటే..

ఆరెంజ్లలో ఉండే విటమిన్-C కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. రోజుకొక ఆరెంజ్ తింటే ఒత్తిడి 20% తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్ వంటి పోషకాలను అందిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది.