News March 18, 2024

మోదీతోనే భారత్ సురక్షితం: అరవింద్

image

ప్రధాని నరేంద్ర మోదీతోనే భారత్ సురక్షితంగా ఉంటుందని, నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానిగా గెలిపించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాలలో సోమవారం విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. సైనికుడు అభినందన్ ను పాకిస్తాన్ చెర నుండి విడిపించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ దన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Similar News

News January 22, 2026

కరీంనగర్ ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్‌మేళా

image

కరీంనగర్‌ ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌డీబీ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, ఇంటర్ ఆపై చదివిన 20 నుంచి 30 ఏళ్లలోపు వయస్సున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్స్ జిరాక్సు కాపీలతో కశ్మీర్‌గడ్డలోని ఈసేవ పైఅంతస్తున గల ఉపాధి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు.

News January 22, 2026

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ మార్కెట్ రోడ్డులో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు సాగే ఈ వేడుకలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, కళ్యాణ మండపం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 21, 2026

KNR: పోలీసుల మానసిక ఉల్లాసానికి ‘శౌర్య’ఇండోర్ గేమ్స్

image

కరీంనగర్ పోలీసు కమిషనరేట్‌లో అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన ‘శౌర్య’ ఇండోర్ గేమ్స్ హాల్‌ను సీపీ గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు. నిరంతరం విధులతో ఒత్తిడికి గురయ్యే సిబ్బంది మానసిక ఉల్లాసం కోసం పాత భవనాన్ని పునరుద్ధరించి టేబుల్ టెన్నిస్, స్నూకర్స్, క్యారమ్స్ వంటి సౌకర్యాలు కల్పించారు. హోంగార్డు నుంచి కమిషనర్ వరకు అందరికీ ఇవి అందుబాటులో ఉంటాయని సీపీ తెలిపారు.