News April 30, 2024

భారత్ ఎక్కడో ఉంది.. మనమే అడుక్కుంటున్నాం: పాక్ మంత్రి

image

ప్రపంచంలోనే భారత్ సూపర్ పవర్‌గా మారుతోందని.. కానీ తామే ఇంకా అడుక్కుంటున్నామని పాకిస్థాన్ మంత్రి మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఆ దేశ పార్లమెంట్‌లో అన్నారు. ‘పొరుగు దేశానికి, మనకూ ఒకేసారి స్వాతంత్య్రం వచ్చింది. కానీ వాళ్లు ఇప్పుడు అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నారు. మనం దివాలా తీసే క్రమంలో ఉన్నాం. దివాలా తీయకుండా ఉండేందుకు IMFను అడుక్కుంటున్నాం’ అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Similar News

News March 11, 2026

ట్రంప్ రిఫైనరీ ప్రాజెక్టుకు రిలయన్సే ఎందుకు?

image

టెక్సాస్ రిఫైనరీ ప్రాజెక్టులో <<19350969>>రిలయన్స్‌<<>>ను పార్ట్‌నర్‌గా చేర్చుకోవడానికి కారణం దాని ‘నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’ (NCI). ప్రపంచంలో అధిక NCI (21.1) ఉన్న రిఫైనరీ జామ్‌నగర్. అంటే ఇది చౌకగా లభించే భారీ ముడి చమురును సైతం అత్యంత నాణ్యమైన ఇంధనంగా మార్చగలదు. ఈ స్థాయి సామర్థ్యం వరల్డ్‌లో మరే రిఫైనరీకి లేదు. వెనిజులా నుంచి వచ్చే చమురును శుద్ధి చేయడానికి రిలయన్స్ వంటి కాంప్లెక్స్ రిఫైనరీ అవసరం.

News March 11, 2026

ఇండియాకు వస్తున్న షిప్‌పై ఇరాన్ దాడి!

image

గుజరాత్‌కు వస్తున్న థాయి‌లాండ్‌ కార్గో షిప్‌ ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడికి దిగింది. UAEలోని ఖలీఫా పోర్టు నుంచి బయల్దేరిన కాసేపటికే హార్ముజ్ జలసంధి వద్ద అటాక్ చేసింది. ఇది తమ పనేనని తాజాగా ధ్రువీకరించింది. అందులోని 20 మంది సిబ్బందిని కాపాడగా, ముగ్గురు మిస్ అయ్యారు. ప్రేషియస్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఈ నౌక కండ్లా పోర్టు(గుజరాత్)కు వస్తోంది.

News March 11, 2026

గ్యాస్ బుక్ చేస్తున్నారా?

image

TG: గ్యాస్‌ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. అందుకు నకిలీ LPG బుకింగ్ సైట్లను క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. త్వరగా సిలిండర్ సప్లై చేస్తామంటే నమ్మొద్దని, అది మోసమని గ్రహించాలని చెప్పారు. సిలిండర్ బుకింగ్ పేరిట అపరిచిత వ్యక్తులకు OTPలు చెప్పొద్దని సూచించారు. ఈ తరహా మోసాలకు గురైతే 1930కి వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.