News October 11, 2025

అఫ్గాన్‌ను భారత్ టెర్రర్ బేస్‌గా వాడుతోంది: పాక్

image

భారత్-అఫ్గాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ DG అహ్మద్ షరీఫ్ ఇండియాపై దారుణమైన ఆరోపణలు చేశారు. ‘పాక్‌లో టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కోసం అఫ్గాన్‌‍ను భారత్ ఒక ఉగ్రవాద స్థావరంగా వాడుకుంటోంది. అఫ్గాన్‌లో ఇతరులకు చోటివ్వడం కేవలం పాక్‌కే కాదు.. సౌదీ, UAE, చైనా, US, తుర్కియే దేశాలకూ ప్రమాదమే’ అని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు ‘ది డాన్’ నివేదికలో పేర్కొంది.

Similar News

News October 11, 2025

నేతన్న భరోసా పథకానికి రూ.48.80 కోట్లు: మంత్రి తుమ్మల

image

TG: నేతన్న భరోసా పథకానికి ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేతలకు రూ.18వేలు, అనుబంధ కార్మికులకు రూ.6వేల చొప్పున రెండు విడతల్లో అందజేస్తామన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 6,780 మందికి రూ.లక్ష వరకు మాఫీ కానున్నట్లు పేర్కొన్నారు. 65 లక్షల ఇందిరమ్మ చీరలను నవంబర్ 15 నాటికి సిద్ధం చేయాలని సూచించారు.

News October 11, 2025

10,000+ జనాభా ఉంటే రూర్బన్ పంచాయతీలు: Dy.CM

image

AP: 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తించనున్నట్లు <<17972541>>Dy.CM పవన్<<>> తెలిపారు. రూర్బన్ పంచాయతీలలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. గ్రేడ్-1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శులకు వేతన శ్రేణి పెంపుతో పాటు డిప్యూటీ MPDO కేడర్‌కు వారిని ప్రమోట్ చేస్తామన్నారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమించనున్నట్లు పేర్కొన్నారు.

News October 11, 2025

మూడో తరగతి నుంచే AI పాఠాలు!

image

వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో మూడో తరగతి నుంచే AIపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఫ్యూచర్ వర్క్ ఫోర్స్‌ను AI-రెడీగా మార్చాలని భావిస్తోంది. టీచర్లు AI టూల్స్ వాడి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు జరుగుతున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. కాగా కొన్ని CBSE స్కూళ్లలో ఇప్పటికే AIపై పాఠాలు బోధిస్తున్నారు.