News December 8, 2024

భారత్ ఘోర పరాజయం

image

అడిలైడ్ డే నైట్ టెస్టులో భారత్ ఘోర పరాజయంపాలైంది. ఇండియా తొలి ఇన్నింగ్స్ 180కి ఆలౌట్ కాగా ఆస్ట్రేలియా 337 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు చాప చుట్టేసింది. నితీశ్ కుమార్ రెడ్డి(42) ఒక్కరే పోరాడారు. 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సునాయాసంగా టార్గెట్‌ను ఛేదించింది. దీంతో 5 టెస్టుల BGTలో ఇరు జట్లూ 1-1 స్కోర్‌లైన్‌తో సమానమయ్యాయి.

Similar News

News November 28, 2025

22 ఏళ్లకే సర్పంచ్.. ఊరిని మార్చేందుకు యువతి ముందడుగు!

image

డిగ్రీ, పీజీ పూర్తయ్యాక పట్టణాలకు వలసెళ్లకుండా ఊరిని బాగుచేయాలి అనుకునే యువతకు 22 ఏళ్ల సాక్షి రావత్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సర్పంచ్‌గా మారి గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని భావించిన సాక్షికి ఊరి ప్రజల తోడు లభించింది. ఉత్తరాఖండ్‌లోని కుయ్‌ గ్రామ ఎన్నికల్లో ఆమె సర్పంచ్‌గా గెలిచారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ ఉపాధిపై దృష్టి సారించి.. యువ శక్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

News November 28, 2025

పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

image

AP: YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. సరెండర్ కావడానికి 2 వారాల గడువు ఇచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం వారు గతంలో హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో SCని ఆశ్రయించారు.

News November 28, 2025

ఏకగ్రీవాలకు వేలంపాటలు.. SEC వార్నింగ్

image

TG: సర్పంచ్ ఎన్నికల వేళ ఏకగ్రీవాలకు జోరుగా వేలంపాటలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ పదవిని అంగట్లో సరుకులా డబ్బులు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించేశారు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సిన పదవిని వేలంపాటలో కొనుగోలు చేయడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.