News July 27, 2024

టాస్ ఓడిన భారత్

image

భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్: గిల్, యశస్వీ జైస్వాల్, పంత్, సూర్య(C), రింకూ, పరాగ్, పాండ్య, అక్షర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్, సిరాజ్.
శ్రీలంక: నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా, అసలంక (C), షనక, కమిందు మెండిస్, హసరంగ, తీక్షణ, దిల్షన్ మధుశంక, మతీషా పతిరణ, అశిత ఫెర్నాండో.
** సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ మ్యాచ్ వీక్షించొచ్చు.

Similar News

News November 11, 2025

యంగ్‌గా ఉండాలా.. ఎక్కువ భాషలు నేర్చుకో

image

వయసు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఒకే భాషలో మాట్లాడేవారితో పోలిస్తే 2 అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడేవారి మెదడు యవ్వనంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. 27 యూరోపియన్ దేశాలలో 51-90 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 80వేల మందిపై జరిపిన స్టడీలో ఇది వెల్లడైంది. ఒకే భాషలో మాట్లాడేవారి మెదడు 2 రెట్లు త్వరగా వృద్ధాప్య దశకు చేరుకుంటున్నట్టు స్పష్టమైంది. లేటెందుకు ఈరోజు నుంచే కొత్త భాష నేర్చుకోండి.

News November 11, 2025

కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్.. Way2Newsలో వేగంగా..

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఈ సాయంత్రం విడుదల కానున్నాయి. సా.6.30 గం.కు వివిధ ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నాయి. Way2Newsలో వేగంగా వాటిని తెలుసుకోవచ్చు. మరోవైపు ఈ నెల 14న ఎన్నికల తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

News November 11, 2025

యాపిల్ కొత్త ఫీచర్.. నెట్‌వర్క్ లేకున్నా మ్యాప్స్, మెసేజెస్!

image

మొబైల్ నెట్‌వర్క్‌ అందుబాటులో లేకున్నా మ్యాప్స్, మెసేజ్‌లు పనిచేసే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు యాపిల్ ప్రయత్నిస్తోందని బ్లూమ్‌బర్గ్ ఒక రిపోర్టులో తెలిపింది. యాపిల్‌కు చెందిన ఇంటర్నల్ శాటిలైట్ కనెక్టివిటీ గ్రూప్ ఇప్పటికే గ్లోబల్‌స్టార్‌ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. శాటిలైట్ ద్వారా పనిచేసే ఎమర్జెన్సీ SOS ఫీచర్‌ను 2022లో విడుదల చేసిన iPhone14లోనే అందుబాటులోకి తెచ్చింది.