News August 2, 2024
టాస్ ఓడిన భారత్.. హిట్టర్‌కు నో ప్లేస్

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రిషభ్ పంత్‌ను IND తుది జట్టులోకి తీసుకోలేదు. కీపర్‌గా రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చింది.
IND: రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, సుందర్, దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్, అర్ష్‌దీప్, మహ్మద్ సిరాజ్
SL: నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, లియానాగే, హసరంగా, వెల్లలగే, ధనంజయ, అసిత ఫెర్నాండో, మొహమ్మద్ షిరాజ్
Similar News
News November 19, 2025
అనకాపల్లి: ‘రోజుకు 30-40 సదరం స్లాట్స్’

అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరన్ క్యాంపు ఏర్పాట్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ క్యాంపునకు వచ్చిన దివ్యాంగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల అర్హత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు రోజుకు 30-40 స్లాట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. దీనిని ఆధునీకరించాల్సి ఉందన్నారు.
News November 19, 2025
వాట్సాప్ ఛానెల్ ద్వారా ‘జైషే’ ఉగ్ర ప్రచారం

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ డిజిటల్ నెట్వర్క్ ద్వారా యువతను టెర్రరిజమ్ వైపు మళ్లిస్తోంది. ఈ సంస్థకు సంబంధించిన వాట్సాప్ ఛానెల్‌ను నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ ఛానెల్‌కు 13వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీని ద్వారా వేలాది మందిని ఉగ్రమూకలుగా JeM మారుస్తోంది. కాగా ఢిల్లీ పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన డానిష్‌ను పోలీసులు పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.
News November 19, 2025
24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లు: సత్యకుమార్ యాదవ్

AP: అత్యవసర వైద్య సేవల కోసం 24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్(CCB)లు అందుబాటులోకి రానున్నాయి. PMABHIM కింద ₹600 కోట్లతో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. వీటి పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. వీటిలో 13 వచ్చే నెలాఖరుకు, మిగతావి 2026 ఆగస్టు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. కోవిడ్‌లో అత్యవసర వైద్యానికి ఇబ్బంది అయ్యింది. అటువంటివి మళ్లీ రాకుండా కేంద్రం దేశంలో 621 CCBలను నెలకొల్పుతోంది.


