News July 6, 2024

జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి

image

జింబాబ్వేతో తొలి T20లో భారత్ 13 రన్స్ తేడాతో ఓడిపోయింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 102 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ గిల్(31) రన్స్ చేయగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. అభిషేక్, రింకూ డకౌట్ కాగా.. అవేశ్ 16, బిష్ణోయ్ 9, రుతురాజ్ 7, జురెల్ 7, పరాగ్ 2 రన్స్ చేశారు. చివర్లో సుందర్ 27 రన్స్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్‌లో జింబాబ్వే1-0తో ఆధిక్యం సాధించింది.

Similar News

News November 26, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

image

ఎనుమాముల మార్కెట్‌‌కి బుధవారం మిర్చి తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.17,000 ధర రాగా.. బుధవారం రూ.17,100 అయింది. అలాగే, వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.19,500 ధర రాగా, ఈరోజు రూ.18,500 ధర వచ్చింది. మరోవైపు తేజ మిర్చికి నిన్న రూ.14,600 ధర వస్తే.. నేడు రూ.15,100 అయింది.

News November 26, 2025

దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్!

image

హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తృతపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ORR వరకు, అవతలి వైపు ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలనూ గ్రేటర్‌గా పరిగణించనుంది. 1,2 నెలల్లో డివిజన్లు, కార్పొరేషన్ల విభజన పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.

News November 26, 2025

18 ఏళ్ల యువతను గౌరవిద్దాం: మోదీ

image

ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత పౌరులపై ఉందని PM మోదీ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ‘18ఏళ్లు నిండి, తొలిసారి ఓటు వినియోగించుకునే యువతను ఏటా NOV 26న విద్యాసంస్థల్లో గౌరవించాలి. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయన్న గాంధీ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ వైపు అడుగులు వేయాలి’ అని పేర్కొన్నారు.