News September 22, 2024

చరిత్ర సృష్టించిన భారత్

image

చెస్ ఒలింపియాడ్‌-2024లో భారత్ తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో తొలిసారి పసిడి పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది. ఓపెన్ సెక్షన్‌లో భారత్‌ మరో రౌండ్‌ మిగిలుండగానే 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా ప్లేయర్‌ ఫాబియానో కరువానను దొమ్మరాజు గుకేశ్‌ ఓడించారు. ఈయన నవంబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తలపడనున్నారు. కాగా 2020లో రష్యాతో కలిసి భారత్ సంయుక్త విజేతగా నిలిచింది.

Similar News

News September 22, 2024

ఇండో – ప‌సిఫిక్ దేశాల‌కు మోదీ కీల‌క హామీ

image

క్యాన్స‌ర్‌పై పోరాటంలో భాగంగా ఇండో-పసిఫిక్ దేశాల‌కు భార‌త్ త‌ర‌ఫున 40 మిలియ‌న్ల వ్యాక్సిన్ డోసుల‌ను అందిస్తామని PM మోదీ హామీ ఇచ్చారు. క్యాన్స‌ర్ మూన్‌షాట్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ వ్యాక్సిన్ల‌తోపాటు రేడియోథెర‌పీ, క్యాన్స‌ర్ నిర్మూళ‌న‌కు సామ‌ర్థ్యాల పెంపులో సాయం చేస్తామ‌న్నారు. కోట్లాది ప్ర‌జ‌ల జీవితాల్లో ఇది ఆశాకిర‌ణంగా నిలుస్తుంద‌ని చెప్పారు. క్వాడ్ ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేస్తుందన్నారు.

News September 22, 2024

VIRAL: ఈ ఆటో డ్రైవర్ చాలా స్మార్ట్!

image

ఆన్‌లైన్ పేమెంట్స్ రిసీవ్ చేసుకునేందుకు బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ స్మార్ట్ వాచ్‌లో క్యూఆర్ కోడ్ చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా, ఈయన మరీ అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారంటూ నెటిజన్లు పలు రకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ‘ఇది యూపీఐ స్వాగ్. పేమెంట్స్ చేయడం చాలా ఈజీ’ అని Xలో పోస్ట్ చేశారు.

News September 22, 2024

తిరుమల లడ్డూ వివాదంపై సద్గురు, రవిశంకర్ కామెంట్స్

image

తిరుమల లడ్డూ కల్తీ అవడం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని ఆధ్యాత్మిక గురువులు సద్గురు, రవిశంకర్ అన్నారు. అందుకే దేవాలయాల నిర్వహణ బాధ్యతలను భక్తులకు అప్పగించాలని వ్యాఖ్యానించారు. భక్తి లేని చోట పవిత్రత ఉండదని సద్గురు పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణ బాధ్యతలను వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలకు కాకుండా మత పెద్దలు, భక్తులకు అప్పగించాల్సిన టైమ్ వచ్చిందని రవి శంకర్ ట్వీట్ చేశారు.