News August 16, 2025

INDIA MAP: రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలిలా

image

కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్, రవాణా ఖర్చులు, డీలర్ కమీషన్‌తో పెట్రోల్ ధరలు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండవు. వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల వివరాలు తెలిపే మ్యాప్ వైరలవుతోంది. ఇందులో అత్యధికంగా APలో ₹109.5, TGలో ₹107.46 ఉన్నాయి. అలాగే అత్యల్పంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ₹82.46గా ఉంది. గతంలో BJP పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించడం వల్ల అక్కడి ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది.

Similar News

News August 17, 2025

శుభ సమయం (17-08-2025) ఆదివారం

image

✒ తిథి: బహుళ నవమి రా.8.31 వరకు
✒ నక్షత్రం: కృత్తిక ఉ.6.45 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేవు
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13
✒ వర్జ్యం: రా.9.39-11.09 వరకు
✒ అమృత ఘడియలు: తె.2.07-3.36 వరకు

News August 17, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* TG: భారీ వర్షసూచన.. మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి: CM రేవంత్
* కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరానికి మరో నీతా: KTR
* చంద్రబాబుకు మద్దతుగా రేవంత్: జగదీశ్ రెడ్డి
* AP: ఫ్రీ బస్సు టికెట్‌తో సెల్ఫీ దిగండి: మంత్రి లోకేశ్
* తిరుమలకు ఫ్రీ బస్ స్కీమ్ వర్తించదు: అధికారులు
* కృష్ణా, గోదావరి పరివాహక ప్రాజెక్టులకు భారీగా వరద

News August 17, 2025

ప.బెంగాల్‌ ‘న్యూ కశ్మీర్’గా మారుతోంది: వివేక్ అగ్నిహోత్రి

image

ప.బెంగాల్‌లో జనాభా మార్పులపై ఫిల్మ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రాన్ని ‘న్యూ కశ్మీర్’గా అభివర్ణించారు. ఫేక్ IDలతో వస్తున్న అక్రమ వలసదారులకు బెంగాల్ ప్రభుత్వం అధికారాలు కల్పిస్తోందన్నారు. 1946 కలకత్తా అల్లర్లపై ఆయన తీసిన ‘The Bengal Files’ మూవీ ట్రైలర్ లాంచ్‌ను ఇవాళ పోలీసులు రెండుసార్లు అడ్డుకున్నారు. దీంతో వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేస్తున్నారని ఆయన ఫైరయ్యారు.