News March 17, 2025
IMLT20 విజేతగా ఇండియా మాస్టర్స్

IML T20 లీగ్ విజేతగా టీమ్ ఇండియా అవతరించింది. రాయ్పూర్లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్ను ఇండియా మాస్టర్స్ 6వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 149 పరుగుల టార్గెట్ను భారత్ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ (25) మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.
Similar News
News March 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 17, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 17, 2025
మార్చి17: చరిత్రలో ఈరోజు

*1892 : తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం.
*1896 : నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత మహిళ కల్పనా చావ్లా జననం
*1990: బాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం